Monday, December 23, 2024

ఆ బకాయిలను విడుదల చేయండి… కేంద్రానికి హరీష్ లేఖ

- Advertisement -
- Advertisement -

తెలంగాణకు రావాల్సిన బకాయిలు విడుదల చేయండి..
కేంద్రానికి మంత్రి హరీశ్ రావు లేఖ..

Please release funds from central govt

హైదరాబాద్: కేంద్ర ప్ర‌భుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్ల‌ను విడుద‌ల చేయాలంటూ ఆర్థిక శాఖ మంత్రి త‌న్నీరు హ‌రీశ్‌రావు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌కు లేఖ రాశారు. గతంలో చేసిన అభ్యర్థనలను ఈ లేఖ‌లో గుర్తు చేశారు.

లేఖలో పేర్కొన్న విజ్ఞప్తులు…..

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 94 (2) ప్రకారం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేటాయించిన నిధుల్లో రెండేండ్ల బ‌కాయి రూ.900 కోట్లు ఇంకా విడుదల చేయాల్సి ఉందని, వీటిని విడుద‌ల చేయడంతోపాటు గ్రాంట్‌ను 2021-22 తర్వాత ఐదేళ్లపాటు పొడిగించాలని కోరుతున్నాను. నీతిఆయోగ్ సూచించిన మేర‌కు రూ.24,205 కోట్లు విడుద‌ల చేయాల్సిందిగా విన్న‌విస్తున్నాను. స్థానిక సంస్థలకు రూ.817.61 కోట్లు (గ్రామీణ స్థానిక సంస్థలకు రూ. 315.32 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు రూ. 502.29 కోట్లు) ఇవ్వాల‌న్న 14వ ఆర్థిక సంఘం సిఫార‌సుల‌ను కేంద్రం ఎందుకు తిర‌స్క‌రించిందో ఇప్ప‌టికీ అర్థం కావ‌డం లేదు. రాష్ట్రం అన్ని షరతులను పూర్తి చేసినప్పటికీ, నిర్దిష్ట కారణం లేకుండా ఈ గ్రాంట్ల‌ను తిర‌స్క‌రించారు. కాబట్టి వీటిని వీలైనంత త్వరగా విడుదలయ్యేలా చూడాలని అభ్యర్థిస్తున్నాను.

2019-20తో పోల్చితే 2020-21లో రాష్ట్రానికి పన్నుల్లో వాటా తగ్గుతుందని ఈ మేర‌కు తెలంగాణ‌కు రూ.723 కోట్ల ప్రత్యేక గ్రాంట్ విడుద‌ల చేయాల‌ని 15వ ఆర్థిక సంఘం సూచించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆర్థిక సంఘం సిఫార్సుల‌ను గతంలో ఎప్పుడూ తిర‌స్క‌రించిన సంద‌ర్భాలు లేవు. కాబ‌ట్టి ఎలాంటి ఆలస్యం లేకుండా ఈ నిధుల‌ను మంజూరు చేయాలి.

 రాష్ట్రంలో అమలు చేస్తున్న కేంద్ర ప్రాయోజిత పథకాలలో… రాష్ట్రం ఏర్పడిన మొదటి సంవత్సరమైన 2014-15లో కేంద్రం వాటాను పొర‌బాటున తెలంగాణ‌కు కాకుండా ఆంధ్రప్రదేశ్‌కు విడుదల చేశారు. దీంతో తెలంగాణ‌కు రావాల్సిన రూ.495.20 కోట్లు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాయి. ఈ విషయాన్ని మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతోపాటు అకౌంటెంట్ జనరల్ దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ, ఇంకా తెలంగాణకు ఇంకా సర్దుబాటు చేయలేదు. కాబట్టి ఈ మొత్తాన్ని వెంట‌నే తెలంగాణకు విడుదల చేయవలసిందిగా కోరుతున్నాను. వీటితోపాటు పెండింగ్ లో ఉన్న ఐజిఎస్ టి నిధులు రూ.210 కోట్ల‌ను కూడా స‌ర్దుబాటు చేయాల్సిందిగా కోరుతున్నాను.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News