Monday, January 20, 2025

ఆర్.ఆర్.ఆర్ చిత్ర గీతానికి గోల్డెన్ గ్లోబ్ పురస్కారం దక్కడం సంతోషదాయకం : హీరో పవన్ కళ్యాణ్

- Advertisement -
- Advertisement -

 

ఆర్.ఆర్.ఆర్. చిత్రంలోని ‘నాటు నాటు…’ గీతానికి ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ పురస్కారం దక్కడం భారతీయులందరూ ఎంతో సంతోషించదగ్గ విషయమని హీరో పవన్ కళ్యాణ్ ఆనందం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకొన్న ఈ గీతానికి స్వరకల్పన చేసిన ఎం.ఎం.కీరవాణికి అభినందనలు తెలిపారు. తెలుగు గీతానికి ఉన్న కీరిప్రతిష్టలను గోల్డెన్ గ్లోబ్ పురస్కారం మరింత ఇనుమడింపచేస్తుందని పేర్కొన్నారు.

నాటు నాటు గీతాన్ని రచించిన చంద్రబోస్, ఆలపించిన గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవలకు ప్రత్యేక అభినందనలు తెలియపరిచారు. ఆస్కార్ పురస్కారం కోసం పోటీపడుతున్న ఈ చిత్రం ఆ వేదికపైనా పురస్కారాలు పొందాలని ఆకాంక్షించారు. ఈ చిత్రాన్ని ప్రపంచ స్థాయి ప్రశంసలు పొందేలా రూపుదిద్దిన దర్శకుడు రాజమౌళి, చిత్ర కథానాయకులు రాంచరణ్, ఎన్టీఆర్, నిర్మాత డి.వి.వి.దానయ్య శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News