Monday, January 20, 2025

వరంగల్ లో ప్లాట్ల వేలం….

- Advertisement -
- Advertisement -

కుడా ఆధ్వర్యంలో యుని సిటీ ఫ్లాట్ల వేలం…..
చైర్మన్ వైస్ చైర్మన్ సమక్షంలో వేలం పాటల నిర్వహణ….

వరంగల్: కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉనికిచర్ల లో ఆదివారం ‘యుని సిటీ’ లే అవుట్ ప్లాట్ల వేలం జరిగింది. మొత్తం 200, 300 చదరపు గజాల 56 రెసిడెన్షియల్ ప్లాట్లకు బహిరంగ వేలం నిర్వహించారు. రెసిడెన్షియల్ ప్లాట్ల విక్రయానికి గజానికి రూ.12 నుండి 13 వేల కనీస ధర నిర్ణయించ గా బిడ్డర్లు/కోనుగోలుదారులు కనిష్టంగా రూ 17,800, గరిష్టంగా రూ 23,300 ధర వరకు కూడా వేలం పాటలో ప్లాట్ల కొనుగోలు చేయడం జరిగింది. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన ప్లాట్ల వేలం సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. రెండవ విడతలో చేపట్టే ప్లాట్ల వేలం తేదీని త్వరలో ప్రకటిస్తామని కుడా అధికారులు తెలిపారు.

ఈ సందర్భం గా కుడా ఛైర్మెన్ సుందర్ రాజ్ యాదవ్ మాట్లాడారు. ప్రభుత్వ పరం గా ప్లాట్ల వేలం కొనసాగిందని, ప్రజల్లో ఎలాంటి అనుమానాలకు అవకాశం ఇవ్వకుండా, వేలం పాటలు అందరి సమక్షంలో పారదర్శకంగా నిర్వహించామని,అన్ని రకాల సౌకర్యాలతో ప్లాట్ లను అందిస్తామని చెప్పారు.  కుడా వైస్ చైర్మన్ షేక్ రిజ్వాన్ బాషా మాట్లాడారు. గతంలో ఓ సిటీ, మా సిటీ లలో కుడా తరపున వేలం పాటలు నిర్వహించి విజయవంతం కావడం జరిగిందని, దశల వారిగా అన్ని రకాల సౌకర్యాలు అట్టి వెంచర్ లొ అందజేయడం జరిగిందని, ఈ ప్రాంతం లో కూడా డ్రైనేజ్ వ్యవస్థ, స్ట్రీట్ లైట్ ఏర్పాటు,చక్కని రోడ్లు తదితర ఏర్పాట్లు త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు.

వేలంలో పాల్గొనే వారు రూ.25వేలు దరావతు చెల్లించి వేలంలో పాట లో పాల్గొన్నారు. వేలం పాట లో పొందిన ప్లాట్లకు మూడు రోజుల్లో 25 శాతం డబ్బులు చెల్లించాలని, మిగిలిన 75 శాతం డబ్బులు 90 రోజుల్లో చెల్లించాలని కుడా అధికారులు తెలిపారు. ఈ సందర్భం గా కొనుగోలుదారుల సౌకర్యార్థం. వివిధ బ్యాంకర్లు రుణాలు ఇచ్చేందుకు స్థానికం గా తాత్కాలికం గా కౌంటర్ లు ఏర్పాటు చేశారు. ఇట్టి కార్యక్రమం లో ప్రణాళికాధికారి అజిత్ రెడ్డి, సెక్రటరీ డా.మురళీధర్ రావు, ఈఈ భీంరావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News