Sunday, December 22, 2024

బహుజనవాదం రాజకీయ ఉద్యమంగా మారాలి: డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్:  బహుజనవాదం బలమైన రాజకీయ ఉద్యమంగా మారితేనే బహుజనులకు రాజ్యాధికారం దక్కుతుందని బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. సామాజిక న్యాయమే లక్ష్యంగా ఏర్పడ్డ బంధు సొసైటీ 30వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాజ్యాధికారంతోనే బహుజనులకు సామాజిక,ఆర్ధిక,రాజకీయ అభివృద్ధి జరుగుతుందన్నారు. బహుజనుల మహనీయుల విగ్రహాలు గ్రామాల్లో ఎన్ని పెట్టినా అధికారం దక్కదన్న ఆయన బహుజనుల ఓట్లు బహుజనులు వేసుకుంటేనే రాజ్యాధికారం దక్కుతుందన్నారు.

ఆధిపత్య పార్టీలకు ఓట్లు వేసినంత కాలం బహుజనులు బతుకులు మారవన్నారు. రాష్ట్రంలో ఉన్న కుల సంఘాల నాయకులకు స్పష్టమైన లక్ష్యం ఉండాలన్న ఆయన.. కుల సంఘాల నాయకులు ఎన్నికల చివరి రోజుల్లో ఆధిపత్య పార్టీలకు అమ్ముడుపోతున్నారని తెలిపారు. బహుజనులు ఎన్నో ఏళ్లుగా పాలితులుగానే ఎందుకు ఉంటున్నారో నిరంతరముా ఆలోచించి,రాజ్యాధికారం పొందే దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి అప్పికట్ల భరత్ భూషణ్ అధ్యక్షత వహించగా ప్రో.ముత్తయ్య, ప్రో.ఇటిక్యాల పురుషోత్తం, ప్రో.నతానియెల్, ప్రో.జి.కనకయ్య, జూపాక సుభద్ర, పల్లర్ల వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News