- Advertisement -
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వివిధ రాష్ట్రాల హోం మంత్రులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చింతన్ శివిర్‌లో ప్రసంగించారు. రాష్ట్రాలు, కేంద్రం మధ్య సంఘీభావం ఉండాలని, నేరాలని ఎదుర్కొనడంలో నవీన టెక్నాలజీలను ఉపయోగించాలని అన్నారు. హర్యానాలోని సూరజ్‌కుండ్‌లో రెండు రోజుల చింతన్ శివిర్ జరుగుతోంది. ఇందులో హోం కార్యదర్శులు, రాష్ట్ర డిజిపిలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాల డైరెక్టర్ జనరల్స్, సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్స్(సిపిఒలు) హాజరవుతున్నారు.
ఈ చింతన్ శివిర్‌లో పోలీసు బలగాల ఆధునీకరణ, సైబర్ క్రైమ్ మేనేజ్‌మెంట్, క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఐటీ వినియోగం పెంపు, భూసరిహద్దుల నిర్వహణ, తీర రక్షణ, మహిళా భద్రత, డ్రగ్ ట్రాఫికింగ్‌కు సంబంధించిన అంశాలను చర్చించనున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.
- Advertisement -