Monday, December 23, 2024

మోదీ తర్వాత పిఎం అయ్యే అవకాశం వారిద్దరికే!

- Advertisement -
- Advertisement -

మోదీ తర్వాత ప్రధానమంత్రి అయ్యే అర్హత ఎవరికి ఉంది? సిఓటర్, ఇండియా టుడే ‘మూడ్ ఆఫ్ ది నేషన్‘ పేరిట ఈ అంశంపై సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలువడ్డాయి. మోదీ తర్వాత హోం మంత్రి అమిత్ షా, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దాస్ లకే ప్రధాని అయ్యే అర్హతలు ఉన్నాయని ఈ సర్వేలో పాల్గొన్న ఎక్కువమంది అభిప్రాయపడ్డారు.

రానున్న లోక్ సభ ఎన్నికల్లో బిజేపి నేతృత్వంలోని జాతీయ డెమోక్రటిక్ అలయన్స్ మరోసారి ఘన విజయం సాధించడం ఖాయమని ఈ సర్వేలో ఇప్పటికే వెల్లడైన విషయం తెలిసిందే. తాజాగా ఇదే సర్వేలో మరో ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. మోదీ తర్వాత ప్రధాని పదవిని చేపట్టే అవకాశం, అర్హత ఎవరికి ఉన్నాయన్న ప్రశ్నకు 29 శాతం మంది అమిత్ షాకు ఓటు వేయగా, 25 శాతం మంది ఆదిత్యనాథ్ కు అనుకూలంగా తీర్పు చెప్పారు. ఇదే సర్వేలో జాతీయ రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ మూడో స్థానంలో ఉన్నారు. సర్వేలో పాల్గొన్నవారిలో 16 శాతం మంది నితిన్ గడ్కరీకి ఓటు వేశారు.

సిఓటర్, ఇండియా టుడే చేపట్టిన సర్వేలో ఎన్టీయే 335 సీట్లు గెలుచుకుని, మళ్లీ అధికారంలోకి వస్తుందని ఇప్పటికే వెల్లడైంది. ఇండియా కూటమికి 166 సీట్లు మాత్రమే లభిస్తాయని సర్వేలో తేటతెల్లమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News