Monday, December 23, 2024

ప్రధాని అమిత్ షా.. హోంమంత్రి మోడీ

- Advertisement -
- Advertisement -

PM Amit Shah Says Assam CM Himanta Sarma

అసోం సిఎం మాటలతో కలకలం

గువహతి : మన ప్రధాని అమిత్ షా అంటూ అసోం ముఖ్యమంత్రి హిమంతా బిశ్వ శర్మ బుధవారం ఇక్కడ ఓ సభలో సంబోధించడం కలకలానికి దారితీసింది. ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో శర్మ మాట్లాడుతూ వేదికపై ఉన్న అమిత్ షా వైపు చూస్తూ మన ప్రియతమ ప్రధాని అమిత్ షా, మన హోం మంత్రి నరేంద్ర మోడీ అని అసామీలో మాట్లాడుతూ పేర్కొన్నారు. అయితే ఆయన పొరపాటున అసంకల్పితంగా ఈ మాటలు అన్నారని ఆ తరువాత బిజెపి అధికార ప్రతినిధి రూపం గోస్వామి తెలిపారు. ఆయన నోరుజారిందనివివరణ ఇచ్చారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ విషయంపై వెంటనే స్పందించింది. బిజెపి అప్పుడే దేశ తదుపరి ప్రధానిని ఖరారు చేసుకుందా? అని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు.

గతంలో అసోం సిఎంగా సర్బానంద సోనోవాల్ ఉన్నప్పుడు అసోంకు చెందిన తేజ్‌పూర్ బిజెపి ఎంపి తేజ్ పల్లబ్ లోచన్ దాస్ బహిరంగంగానే అసోం సిఎం శర్మ అని వ్యాఖ్యానించారని, అప్పట్లో శర్మ రాష్ట్ర మంత్రిగా ఉన్నారని కాంగ్రెస్ గుర్తు చేసింది. ఎంపి మాటల తరువాత నిజంగానే అసోం సిఎంగా శర్మ అయ్యారని గుర్తుచేశారు. ఇప్పుడు అసోంవేదికగానే పిఎం అమిత్ షా అనే మాటలు వెలువడ్డాయని, అంటే ఈ విధంగా ఇప్పటికే తదుపరి పిఎం ఖరారయ్యారా? అని కాంగ్రెస్ స్పందించింది. దీనిపై బిజెపి ఎదురుదాడికి దిగింది. అసోంలో కాంగ్రెస్‌కు రాజకీయంగా బిజెపిని దెబ్బతీసే శక్తి లేదని, సంపూర్తిగా తన పట్టు కోల్పోయిందని, అందుకే ఇప్పుడు ఈ విధంగా అసందర్భ అనుచిత అంశాలతో బిజెపితో తలపడాలని చూస్తోందని బిజెపి అధికార ప్రతినిధి రూపమ్ గోస్వామి విమర్శించారు. అనుకోకుండా ప్రసంగాలలో తప్పులు దొర్లుతాయని, దీనిని గొరంతలు కొండంతలు చేస్తారా? దీని వల్ల వారి విలువ మరింత దిగజారుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News