Wednesday, January 22, 2025

16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకంపై నిషేధం

- Advertisement -
- Advertisement -

16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడటాన్ని నిషేధించే విధంగా ఆస్ట్రేలియా ప్రభుత్వం కొత్త చట్టాన్ని అమలు చేయడానికి సిద్ధమైంది. ఈమేరకు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ గురువారం ప్రకటించారు. నవంబర్ 18 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఈ చట్టాన్ని ప్రవేశ పెడతామని, ఇది ఆమోదం పొందాక, 12 నెలల తరువాత అమలు లోకి వస్తుందని విలేఖరులకు వివరించారు. ఎక్స్, టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ తదితర సామాజికమాధ్యమ వేదికలు 16 లోపు వారిని వీటి వాడకం నుంచి ఎలా మినహాయించాలన్నది ఆలోచించాలని సూచించారు. ఆన్‌లైన్ ప్రభావం వల్ల తమ పిల్లల ఆరోగ్యభద్రత ఏవిధంగా దెబ్బతింటోందో నాలాగే వేలాది మంది తల్లిదండ్రులు, తాతలు, ఆంటీలు,అంకుల్స్, ఆందోళన చెందుతున్నారని అల్బనీస్ పేర్కొన్నారు.

స్మార్ట్‌ఫోన్లు,సోషల్ మీడియా వంటి వాటిని వినియోగించడంలో యువతను ఏ విధంగా పర్యవేక్షించాలో ప్రపంచ దేశాలన్నీ తర్జనభర్జన పడుతున్నాయని ఈ నేపథ్యంలో ఈ ప్రతిపాదన రూపొందిందని వివరించారు. 16 ఏళ్ల లోపు నిబంధనను ఉల్లంఘిస్తే ఆయా సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలు విచారణకు గురవుతాయని , తల్లిదండ్రులకు ఈ బాధ్యత లేదని వివరించారు. అయితే ఈ చర్యను కొంతమంది తల్లిదండ్రులు, పిల్లల సంరక్షకులు, న్యాయవాదులు స్వాగతించినప్పటికీ, నిషేధం పూర్తిగా సాధ్యం కాకపోవచ్చన్న సందేహాలు కూడా వెలువడ్డాయి. ఆన్‌లైన్ ప్రమాదాలకు మూలకారణాలను పరిష్కరించాలే తప్ప ఈ విధంగా పిల్లలను దూరం చేయడం ప్రయోజనం ఉండబోదని మరికొందరు విమర్శిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News