Thursday, January 23, 2025

దేశాభివృద్ధికి కొందరు అడ్డుపడుతున్నారు: ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి కొందరు అడ్డుపడుతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. అవినీతి, బుజ్జగింపు రాజకీయాలు వంటి రుగ్మతలను దేశం నుంచి తరిమివేయాలని ప్రజలు కోరుతున్నారని ప్రధాని తెలిపారు.

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సోమవారం న్యూఢిల్లీ ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని ప్రసంగిస్తూ స్వదేశీపై దేశంలో ఒక నూతన విప్లవం వచ్చిందని చెప్పారు. వచ్చే పండుగల సందర్భంగా స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. దేశంలో ఒక నయా మధ్యతరగతి ఆవిర్భవించిందని, టెక్స్‌టైల్ కంపెనీలకు గొప్ప అవరాశాలు దీని వల్ల ఏర్పడనున్నాయని ఆయన చెప్పారు.

ప్రతిపక్ష ఇండియా కూటమిపై పరోక్షంగా సంధిస్తూ అవినీతి, వారసత్వ రాజకీయాలు, బుజ్జగింపు రాజకీయాలు వంటి రుగ్మలను తరిమివేయాలని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారని తెలిపారు.

దేశంలో ఖాదీ పరిశ్రమ ప్రగతిని ప్రస్తావిస్తూ 2014కు ముందు రూ. 25,000 కోట్ల నుంచి 30,000 కోట్ల మధ్య ఉన్న ఖాదీ అమ్మకాలు ప్రస్తుతం రూ. 1.30 లక్షల కోట్లకు చేరుకున్నాయని తెలిపారు. ప్రపంచ మేటిగా భారతీయ ఖాదీ పరిశ్రమ ఎదగాలన్నదే తమ లక్షమని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News