Saturday, December 21, 2024

రాజకీయాల కోసమే ప్రధాని హైదరాబాద్ వచ్చారు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రతి ఇంటికి తాగునీరు సరఫరా చేసిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని రాష్ట్ర ఐటి పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేసిన రాష్ట్రం తెలంగాణ అని మంత్రి వెల్లడించారు. దేశంలోనే ధాన్యం ఉత్పత్తిలో రెండో రాష్ట్రం తెలంగాణ ఎదిగిందన్నారు. అటు దేశ జీడీపీ వృద్ధికి తోడ్పడుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉందన్నారు.

దేశంలోనే తెలంగాణ అత్యత్తమ పారిశ్రామిక విధానం కలిగిన రాష్ట్రం అన్నారు. రాష్ట్రం గత 9 ఏళ్లలో ఎన్ని రంగాల్లో వృద్ధి సాధించిందని కెటిఆర్ పేర్కొన్నారు. తెలంగాణలా వృద్ధి చెందిన రాష్ట్రాన్ని ప్రధాని చూపించాలని మంత్రి కెటిఆర్ డిమాండ్ చేశారు. కేవలం రాజకీయల కోసం ప్రధాని మోడీ హైదరాబాద్ వచ్చారని మంత్రి కెటిఆర్ ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News