పిఎం కేర్స్‌ఫండ్‌పై సర్కారు
న్యూఢిల్లీ : కోవిడ్ ఉధృతి దశలో ఏర్పాటు అయిన పిఎం కేర్స్ ఫండ్ ప్రభుత్వ పరిధిలోకి రాదని, ఈ నిధి ప్రభుత్వ నిధి కిందికి రాదని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు తెలియచేసుకుంది. ఫండ్ వ్యవహారాలు అన్ని పారదర్శకం అని, ఈ నిధి పరిధిలో వచ్చే విరాళాలు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా కిందికి వెళ్లే ప్రసక్తే లేదని తెలిపారు. ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎంఒ) కార్యనిర్వాహక కార్యదర్శి ఈ మేరకు సుప్రీంకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేశారు. పిఎం కేర్స్ ఓ ట్రస్టు అని, గౌరవప్రాతిపదికన ఏర్పాటు అయిందని. నిధులు అన్ని సక్రమంగా పారదర్శకంగా ఉంటాయని, ఇందులో ఎటువంటి సందేహాలు లేవని తెలిపారు. సంబంధిత నిధి లెక్కలు అన్ని కూడా కాగ్ ఏర్పాటు చేసిన ఓ ఛార్టర్డ్ అకౌంటెంట్ ద్వారా ఆడిట్ చేయడం జరుగుతుందని వివరణ ఇచ్చారు.
పిఎం కేర్స్ ఫండ్ రాజ్యాంగ పరిధిలోకి వచ్చే ఓ ప్రక్రియ అని, ఈ క్రమంలో నిధుల నిర్వహణలో పారదర్శకత ఉండేలా చేయాల్సిన అవసరం ఉందని ఈ మేరకు సుప్రీంకోర్టు ఆదేశాలు వెలువరించాలని దాఖలు అయిన పిటిషన్లకు సమాధానంగా కేంద్రం హైకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసుకుంది. పిఎంఒ లోని కార్యదర్శి పరిధిలోనే ఫండ్ నిర్వహణ జరుగుతోంది. తాను ఈ బాధ్యతలను గౌరవ ప్రాతిపదికనేనిర్వహిస్తున్నానని , ఏది ఏమైనా ఈ ఛారిటబుల్ ట్రస్టును రాజ్యాంగ పరిధిలో కానీ పార్లమెంట్‌లో తీసుకువచ్చిన బిల్లు క్రమంలో కానీ ఏర్పాటు చేయలేదని ఈ కోణంలోనే ట్రస్టును చూడాల్సి ఉంటుందని ఈ అఫిడవిట్‌లో తెలిపారు. ఇక పిటిషనర్ నిజంగానే ప్రజా సంక్షేమ ఉద్ధేశపూరితంగానే ఈ పిటిషన్ దాఖలు చేసినట్లు అయితే, పారదర్శకతకు అభ్యర్థించినట్లు అయితే అవి అమలు అవుతున్న క్రమంలో రాజ్యాంగపరమైన అంతర్భాగం కావాలని కోరాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా పిఎంకేర్స్ తరఫున వివరణ ఇచ్చారు.