Sunday, December 22, 2024

ప్రతి ఒక్కరికి రూ.15 లక్షలు ఏవి? మదురై ఎయిమ్స్‌ సంగతేంటి?

- Advertisement -
- Advertisement -
మోడీ హామీలపై మండిపడిన స్టాలిన్‌

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి,డిఎంకె చీఫ్‌ ఎంకే స్టాలిన్‌, ప్రధాని మోడీపై మండిపడ్డారు. ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడాన్ని నిలదీశారు. ‘ప్రతి ఒక్కరికి రూ.15 లక్షలు ఏవి?, మదురై ఎయిమ్స్‌ సంగతి ఏమైంది?’ అంటూ ప్రశ్నించారు. శుక్రవారం ఒక వివాహ వేడుకలో పాల్గొన్న సిఎం స్టాలిన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాని మోడీని విమర్శించారు. తమిళనాడు ప్రజలకు ఇచ్చిన హామీలపై ప్రధానిని అడిగితే ఆయన నుంచి సమాధానం లేదని ఆరోపించారు. రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న మాటను మోడీ నిలబెట్టుకోలేదన్నారు. మదురై ఎయిమ్స్‌ ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదని మండిపడ్డారు. నల్ల ధనాన్ని వెనక్కి రప్పిస్తామని, ప్రతి భారతీయ పౌరుడి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షల చొప్పున జమ చేస్తామని మోడీ చేసిన వాగ్దానం ఏమైందని ప్రశ్నించారు.  రూ. 15 లక్షలు కాదు కదా, ఒక్కొక్కరికి రూ.15,000 లేదా కనీసం రూ.15 అయినా జమచేశారా? అని నిలదీశారు.

మదురై ఎయిమ్స్‌ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయకపోవడంపై బిజెపి సిగ్గుపడాలని అన్నారు. తన కుమారుడు ఉదయనిధి 2019లో చేపట్టిన నిరసన వంటిది మరోసారి చేయాలా? అని ప్రశ్నించారు. ప్రధాని మోడీ చేసిన వాగ్దానాలను గుర్తు చేసినప్పటికీ నోరు మెదపకపోవడం ఆయనకు అలవాటుగా మరిందంటూ స్థాలిన్‌ మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News