2018 సంవత్సరంలో దేశంలోని ప్రతి రైతుకు ఆర్థిక ప్రయోజనాలను అందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ పథకం కింద ప్రతి రైతుకు ఏటా రూ.6000 అందజేస్తారు. కాగా, ఈ మొత్తం విడతల వారీగా లభిస్తుంది. ప్రతి విడతలో రైతుల ఖాతాలో రూ.2000 వస్తాయి. నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలోకే చేరడం ఈ పథకం ప్రత్యేకత.
ఈ నేపథ్యంలో ఈ నెల అక్టోబర్ 5, 2024న పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 18విడత విడుదలైన విషయం తెలిసిందే. ఈ విడత విడుదలైన తరువాత ఇప్పుడు 19వ విడత కోసం రైతులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పీఎం కిసాన్ యోజన ఏడాదికి మూడుసార్లు వస్తుంది. అంటే..ప్రతి నాలుగు నెలలకు వాయిదా మొత్తం వస్తుంది. 18వ విడత అక్టోబర్ లో వచ్చిన విషయం తెలిసిందే. ఇక 19వ విడత మాత్రం నాలుగు నెలల తర్వాత అంటే ఫిబ్రవరి 2025లో వస్తుంది.
పీఎం కిసాన్ యోజన ప్రయోజనాలను పొందడానికి రైతులు ఈ-కేవైసీని పొందడం చాలా అవసరం. ఒకవేళ రైతు ఇ-కెవైసిని పొందకపోతే..అతను పథకం ప్రయోజనం పొందలేడు. రైతులు మూడు విధాలుగా ఇ-కెవైసిని పొందవచ్చు.
1. OTP ఆధారిత eKYC
2. బయోమెట్రిక్ ఆధారిత eKYC
3. ముఖ ప్రామాణీకరణ ఆధారిత eKYC