Tuesday, November 5, 2024

పిఎం కిసాన్ ఈ-కేవైసి గడువు నేటితో ఆఖరు

- Advertisement -
- Advertisement -

PM Kisan e-KYC deadline ends today

హైదరాబాద్ : పిఎం కిసాన్ స‌మ్మాన్ నిధి యోజ‌న నుంచి ల‌బ్ధి పొందాల‌నుకుంటే ఈ నెల 31 లోపు అంటే బుధ‌వారం అర్ధ‌రాత్రి లోగా ఈ-కేవైసి స‌బ్మిట్ చేయ‌డం త‌ప్ప‌నిస‌రి. లేని ప‌క్షంలో త‌దుప‌రి వాయిదా పీఎం కిసాన్ స‌మ్మాన్ నిధి యోజ‌న కింద డ‌బ్బులు రావు.  రైతులు ఈ-కేవైసీ ప్ర‌క్రియ పూర్తి చేయ‌డానికి రెండు మార్గాలు ఉన్నాయి. స‌మీప కామ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్ (సీఎస్సీ)ని సంద‌ర్శించి ఈ-కేవైసీ పొందొచ్చు. అలా కానీ ప‌క్షంలో ఇంటి వ‌ద్ద నుంచే పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఈ-కేవైసీ ప్ర‌క్రియ పూర్తి చేయొచ్చు. పార్మర్స్ కార్న‌ర్‌లోకి వెళ్లి ఈ-కేవైసీ టాబ్‌పై క్లిక్ చేయాలి. త‌దుప‌రి ద‌శ‌లో మీ ఆధార్ నంబ‌ర్ న‌మోదు చేసిన సెర్చ్ టాబ్‌పై క్లిక్ చేయాలి. రైతుల మొబైల్ ఫోన్‌కు నాలుగు అంకెల ఓటీపీ ల‌భిస్తుంది. ఓటీపీ స‌బ్‌మిట్ ఆప్ష‌న్ క్లిక్ చేయాలి. అప్పుడు ఈ-కేవైసీ పూర్త‌వుతుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News