Friday, January 24, 2025

20 లోపే ఈకెవైసి గడువు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : వ్యవసాయరంగానికి చే యూనిస్తూ అన్నదాతలకు అండగా నిలవాల్సిన కేంద్ర ప్ర భుత్వం నిబధనల పేరుతో రైతుల గుండెల్లో గునపా లు దించుతోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకం పొందుతున్న రైతులను ఈకేవైసి అనుసంధానం పేరుతో కార్యాలయాలు కంప్యూటర్ సెంటర్ల చుట్టు పరుగులు తీ యిస్తోంది. ఈ పథకం కింద ఇప్పటివరకూ ఈకేవైసి అ నుసంధానం చేయించుకోని రైతులకు ఈ నెల 20లోపు డెడ్‌లైన్ పెట్టింది. గడువుదాటితే ఈకేవైసి అనుసంధానం కాని రైతులకు పిఎంకిసాన్ పధకం నుంచి అనర్హులుగా ప్రకటించి నిధుల్లో కోతలు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది.

ప్రధాని కిసాన్ సమ్మాన్ పథకాన్ని కేంద్ర ప్రభు త్వం 2018 డిసెంబన్ నుంచి ఆమలు చే స్తోంది. ఈ పథ కం కింద ఎంపికైన రైతులకు ఏటా రూ. 6వేలు నేరుగా బ్యాంకు ఖాతాలకే జమ చేస్తూ వస్తోంది. ప్రతియేటా ఏప్రిల్ జూన్‌లో ఒకసారి , ఆగష్ట్ నవంబర్‌లో రెండవ సారి, డిసెంబర్‌మార్చిలో మూడవ విడత గా రూ.2వేల చొప్పున నిధులు విడుదల చేస్తోంది.అయి తే ఈ పధకం పట్ల రైతులకు సరైన అవగాహన లేకపోవటం, సమాచారలోపం , త దితర కారణాలతో రాష్ట్రం లో చాలామంది రైతులు ప్రారంబదశలో ఈ పథకానికి దరఖాస్తు చేసుకోలేకపోయారు. రాష్ట్రంలో కేసిఆర్ ప్ర భుత్వం రైతుబంధు పథకాన్ని అమలు చేస్తోంది. ప్రతి ఎకరానికి ఏటా రూ.10 వేల చొప్పున వానాకాలం ఒకసారి, యాసంగిలో మ రో సారి రూ.5వేల చొప్పున రైతుల బ్యాం కు ఖాతాలకు జమ చేస్తోంది.

రైతుబంధు పథకం కింద ఒక్కో సీజన్ లో 65లక్షల మంది రైతు లు లబ్ధి పొందుతున్నారు. ఈపథకం కోసంప్రభు త్వం ఏటా బడ్జెట్‌లో రూ. 15 వే లు కేటాయిస్తూ వస్తోంది. పిఎం కిసాన్ పథకానికి వ చ్చే సరికి రాష్ట్రంలో 39.37లక్షల మందికే ఈ పథకం కింద నిధులు అందుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే సు మారు 26లక్షల మంది రైతులను కేంద్ర ప్రభుత్వం కి సాన్ పథకానికి దూరంగా పెట్టింది.ఉన్న కొద్దిపాటి మం ది రైతులను కూడా సవాలక్షల నిబంధనల పేరుతో అరు ల జాబితానుంచి బయటకు గెంటేందుకు ప్రయత్నాలు చే స్తోంది. అందులో భాగంగానే ఈకేవైసి అనుసంధానం ని బంధన విధించింది. రాష్ట్రంలో పిఎం కిసాన్ పథకానికి ఈ కేవైసి అనుసంధానం 20లోపు చేయించుకోక పోతే ఉన్న కొద్దిపాటి మంది రైతులు కూడా కేంద్ర సా యాన్ని పోందే అవకాశం కోల్పోనున్నారు.

రాష్ట్ర ప్ర భుత్వం ఈకేవైసి అనుసంధానం పట్ల రైతుల్లో అవగాహన కల్పించేందుకు వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా వ్యవసాయ క్లష్టర్ల వారీగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అయితే ఈ అవకాశం నుంచి ఇప్పటికే పిఎం కిసాన్ నిధులు పొం దుతున్న కొన్ని వర్గాల వారికి లేకుండా కఠినమైన నిబంధనలు విధించిం ది. అందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగు లు, వైద్యు లు, న్యాయవాదులు తదితరులతోపాటు ఆదా య పన్నులు చెల్లిస్తున్నవారు,ప్రజాప్రతినిధులు, మాజీ ప్ర జాప్రతినిధులు, విదేశాల్లో నివా సం ఉంటున్నవారిని చే ర్చింది. అంతే కాకుండా ఒక కుటుంబంలో ఒక్కరికే ఈ ప థకాన్ని వర్తింపచేస్తోంది.దీంతో ఈ సారి పిఎం కిసాన్ పథ కం కింద లబ్దిపోందుతున్న 39.37లక్షల మంది రైతుల్లో ఎంతమంది రైతులపై కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనల వేటు వేస్తుందో అన్న ఆందోళనలు పుట్టుకొస్తున్నాయి.

ఈ పథకం పట్ల అవగాహన లేక ఇప్పటివరకూ దరఖాస్తు చే సుకోలేపోయిన కొత్త రైతులకు అవకాశం కల్పించి పిఎం కిసాన్ ద్వారా ఏటా రూ.6వేలు అందజేసి వ్యవసాయరంగాన్ని ప్రోత్సహించాల్సిన కేంద్ర ప్రభుత్వం ఈ నాలుగేళ్లకాలంలో కొత్త రైతులకు మొడిచేయి చూపుతూ వస్తోంది. కఠిననిబంధనలతో అనర్హులను జాబితానుంచి తొలగించేం దు మాత్రం సై..అంటున్న మోడి సర్కారు కొత్తవారికి మా త్రం నై.. అనటం ఇదెక్కడి న్యాయం అని రైతులతోపాటు రై తుసంఘాలు కేంద్రం తీరు పట్ల భగ్గుమంటున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News