- Advertisement -
సుమారు రూ. 22 వేల కోట్లు విడుదల చేయనున్న ప్రధాని
న్యూఢిల్లీ : బీహార్‌లోని భాగల్పూర్‌లో పిఎం కిసాన్ పథకం కింద దేశవ్యాప్తంగా సుమారు పది కోట్ల మంది భూమి ఉన్న రైతులకు 19వ విడతగా రూ. 2000 వంతున సుమారు రూ. 22 వేల కోట్ల నిధులను ప్రధాని సోమవారం విడుదల చేయనున్నారు. ‘ఈ నిధుల విడుదల పిఎం కిసాన్ పథకాన్ని ఆరు సంవత్సరాలుగా విజయవంతంగా అమలు చేస్తుండడానికి ప్రతీక అవుతుంది.
దేశవ్యాప్తంగా రైతుల ఆర్థిక సంక్షేమాన్ని పటిష్ఠం చేస్తుంది’ అని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. 2019 ఫిబ్రవరిలో ప్రారంభించినప్పటి నుంచి 18 విడతలుగా దేశంలోని 11 కోట్ల మందికి పైగా భూమి ఉన్న రైతుల కుటుంబాలకు ఇంత వరకు రూ. 3.46 లక్షల కోట్లకు పైగా నిధులు పంపిణీ చేశారు. పిఎం కిసాన్ పథకం ప్రపంచంలోని అతిపెద్ద డిబిటి పథకాల్లో ఒకటి.
- Advertisement -