Sunday, December 22, 2024

జూన్ తొలివారంలో పిఎం కిసాన్ నిధులు

- Advertisement -
- Advertisement -

PM Kisan funds in June first week

ఈనెలాఖరు వరకూ ఈకెవైసికి గడువు

మనతెలంగాణ/హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు గడువుకంటే ముందుగానే దేశంలోకి ప్రవేశించనున్నట్టు వాతావరణ శాఖ వెల్లడిస్తోంది. మరోవైపు తొలకరి వర్షాలు కూడా వ్యవసాయరంగంలో ఆశలు రేకిస్తున్నాయి. కేంద ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పధకం కింద పంటలకు పెట్టుబడి సాయంగా రైతులకు అందజేసే నిధులను ఈ వానాకాల పంటలకు సంబంధించి జూన్ తొలివారంలోనే అందజేయాలని నిర్ణయించింది. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర వ్యవశాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రధాని కిసాన్ నిధుల విడుదలకు సంబంధించిన ప్రకటన చేశారు. దేశంలో కోట్లాది మంది రైతులకు కేంద్ర మంత్రి తోమర్ చేసిన ప్రకటన పెద్ద ఊరటనిస్తోంది. కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పధకం పరిధిలో ఉన్న ప్రతి రైతుకు ఏటా రూ.6000 నగదు అందజేస్తుంది. ఈ మొత్తాన్ని ఒక్కో దఫా రూ.2000 వంతున మొత్తం మూడు ధఫాలుగా విడుదల చేస్తోంది. ఈ నిధులు నేరుగా రైతుల బ్యాంకుఖాతాలకు జమచేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకూ ఈ పధకం కింద 10విడుతలుగా నిధులు విడుదల చేసింది. వానాకాలం పంటల సాగు సీజన్ సమీపించటంతో 11వ విడతగా ప్రధానిమంత్రి కిసాన్ సమ్మాన్ నిధులు కోసం రైతులు ఎదురు చూస్తున్నారు.

ఈకేవైసికి ఈనెలాఖరు వరకు గడువు:

ప్రధానమంత్రి కిసాస్ నమ్మాన్ నిధి పథకం కింద కేంద్ర ప్రభుత్వం అందజేసే నిధులు అనర్హుల పాలుకాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒక్కో వ్యవసాయ కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ నిధులు అందజేస్తున్నారు. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఒక్కో ఇంట్లో ఇద్దరు ముగ్గురు కుటుంభసభ్యుల పేర్లతో పిఎం కిసాన్ నిధులు పొందుతున్నట్టు ప్రభుత్వ దృష్టికి రావటంతో తాజాగా ఈకెవైసిని అప్‌డేట్ చేసుకునే పక్రియను తెరపైకి తెచ్చింది. ఈ పథకం కింద నిధులు పొందుతున్న వారు ఈకెవైసికి అనుసంధానం చేయించుకోవాలని షరతులు విధించింది. ఆన్‌లైన్ ద్వారా లేదా ఆఫ్‌లైన్ ద్వారా ఈకెవైసి చేయించుకునేందుకు ఈ నెలాఖరు వరకు గడువు ఇచ్చింది. రైతు ఆధార్ కార్డు, ఆధార్‌తో లింక్ చేసుకున్న మొబైల్ ఫోన్ నంబర్ తదితర వివరాలతో ఈ పక్రియ పూర్తి చేసుకోవచ్చని తెలిపింది. మీ సేవా కేంద్రాల్లో కూడా ఈ కేవైసిని పూర్తి చేసుకోవచ్చిని వ్యవసాయశాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ సారి ఈకెవైసి ప్రక్రియ పూర్తి చేసుకున్న రైతుల ఖాతాలకు మాత్రమే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం వర్తిస్తుందని , ఈకేవైసి నమొదు చేసుకొని రైతులు ఈ నెలాఖరు లోగా ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News