Sunday, December 22, 2024

వచ్చెనెల పిఎం కిసాన్ నిధులు విడుదల

- Advertisement -
- Advertisement -

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పధకం కింద జూన్‌లో నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి‘ అనే పథకాన్ని తీసుకొచ్చింది. 2019 ఫిబ్రవరిలో ఈ పథకాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ద్వారా రైతులకు పంట సాయంగా ఎకరానికి ఏటా 6 వేల రూపాయలు అందిస్తోంది. ఈ 6 వేల రూపాయలను సంవత్సరానికి మూడు విడతలుగా రెండు వేల రూపాయల చొప్పున నేరుగా రైతుల అకౌంట్స్‌లో జమ చేస్తూ వస్తోంది. ఏప్రిల్- జులై తొలి విడతగా, ఆగస్టు- నవంబర్ రెండో విడతగా, డిసెంబర్-మార్చి మూడో విడతగా2 వేల చొప్పున కేంద్రం ఈ ఆర్థిక సాయం అందిస్తోంది.కేంద్ర ప్రభుత్వం ఇప్పుటి వరకు పీఎం కిసాన్ పథకం ద్వారా 16 సార్లు నిధులు రిలీజ్ చేసింది. ఫిబ్రవరి 28న మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిధుల్ని విడుదల చేశారు.

ఈ పథకం ద్వారా మొత్తం 9 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పుడు 17వ విడత నిధులు విడుదల కావాల్సి ఉంది. ఇవి ఎప్పుడు అకౌంట్లలో జమ అవుతాయా అని రైతులు ఎదురు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ అధికారుల సమాచారం ప్రకారం.. పీఎం కిసాన్ 17వ విడత డబ్బులు జూన్ నెల మొదటి వారంలో విడుదల చేయనున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ సారి ఈకేవైసి పూర్తి చేసిన వారికి మాత్రమే పీఎం కిసాన్ డబ్బు అకౌంట్‌లో జమ అవుతుందని చెబుతున్నారు. అలాగే బ్యాంక్ ఖాతా కూడా ఆధార్‌తో లింక్ అయ్యి ఉండాలని సూచిస్తున్నారు. ఈ రెండు పనులు చేయకపోతే పీఎం కిసాన్ 17వ విడత డబ్బులు జమ కావని సమాచారం.ఈ పధకం కింద ఉన్న రైతులు వెంటనే ఈ- కేవైసీ పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News