Sunday, December 22, 2024

పిఎం కిసాన్ @ రూ. 8 వేలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వ్యవసాయరంగంలో రైతులకు కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి సాయంగా అందించే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన నిధుల మొత్తాన్ని పెంచేందుకు కసరత్తులు జరుగుతున్నాయి. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్న నేపధ్యంలో రైతులను ఆకర్షించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేపట్టింది. పిఎం కిసాన్ కింద ప్రస్తుతం ఒక్కో రైతుకు ఏటా ఆరు వేలరూపాయలు అందజేస్తోంది. ఈ మొత్తాన్ని ఎనిమిది వేలు లేదా 10వేలకు పెంచాలన్న అభిప్రాయంతో ఉన్నట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వం 2018లో పిఎం కిసాన్ పధకాన్ని ప్రారంభించింది.

అప్పటి నుంచి ఏటా ఆరు వేల రూపాయలు మూడు విడతలుగా రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేస్తు వస్తోంది. ఈ పధకం అమల్లోకి వచ్చాక గత ఏడాది నవంబర్‌లో 15వ విడత నిధులు రైతుల ఖాతాకు జమ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో 16వ విడతగా పిఎం కిసాన్ నిధులు జమ చేసే అవకాశాం ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ నిధులు పెంచిన తర్వాతే రైతులకు పెంచిన నిధులు విడుదల చేసి ఆ మేరకు బ్యాంకు ఖాతాలకు జమ చేసే అవకాశాలు ఉన్నట్టు అధికార వర్గాల సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News