Friday, January 24, 2025

భార్యాభర్తలిద్దరికీ పిఎం కిసాన్‌ సాయం.. కేంద్ర ప్రభుత్వం స్పష్టత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆర్ధికంగా చితికిన రైతన్నలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా ఆర్థిక సాయం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ స్కీమ్‌ ద్వారా రైతులు ఏడాదిలో మూడు విడతలుగా విడతకు రెండువేల చొప్పున మొత్తం రూ.6000 అందుకుంటున్నారు. పిఎం కిసాన్‌ పథకం కింద ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరికీ కూడా వర్తిస్తుందంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగుతోంది.

ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. రైతు కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని, భార్యాభర్తలిద్దరికి వర్తించదని తేల్చి చెప్పింది. అయితే భార్యాభర్తలు ఇద్దరికీ భూమి ఉన్నట్లు వేర్వేరు పాస్‌ పుస్తకాలు ఉన్నప్పటికీ ఒకరికి మాత్రమే ఈ పథకం సాయం అందుతుందని తెలిపింది. ఇలాంటి పుకార్లను నమ్మవద్దని కేంద్రం స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News