Tuesday, January 21, 2025

రేపు పిఎం కిసాన్ కింద రూ. 20 వేల కోట్లు విడుదల

- Advertisement -
- Advertisement -

18వ విడతగా 9.4 కోట్ల మంది రైతులకు లబ్ధి
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా 9.4 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుస్తూ ప్రధాని నరేంద్ర మోడీ శనివారం పిఎం కిసాన్ పథకం 18వ విడతగా రూ. 20 వేల కోట్లు విడుదల చేయనున్నారు. మహారాష్ట్ర వాషిమ్‌లో ఒక కార్యక్రమంలో ప్రత్యక్ష ప్రయోజన బదలీ (డిబిటి) ద్వారా ఆ నిధుల చెల్లింపు జరుగుతుందని ఒక అధికార ప్రకటన తెలియజేసింది.

మహారాష్ట్ర రైతులు రాష్ట్ర షేత్కారి మహాసన్మాన్ నిధి యోజన కింద అదనంగా రూ. 2000 కోట్లు అందుకుంటారు. 18వ విడతతో పిఎం కిసాన్ కింద పంపిణీ చేసే మొత్తం రూ. 3.45 లక్షల కోట్లు దాటుతుంది. దేశవ్యాప్తంగా 11 కోట్ల మందికి పైగా రైతులు లబ్ధి పొందనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News