- Advertisement -
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ పిఎం కిసాన్ యోజన నిధులు సోమవారం నాడు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ మేరకు ఆదివారం నాడు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. అన్నదాతల ఖాతాల్లోకి రూ.16,800 కోట్ల రూపాయల నిధులు వచ్చి చేరనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం రబీ పంటల కోసం ప్రధానమంత్రి-కిసాన్ పథకం కింద ఎనిమిది కోట్ల మంది అర్హులైన రైతులకు 13వ విడత ఆర్థిక ప్రయోజనాలను విడుదల చేయనున్నారు.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద అర్హులైన రైతులకు ప్రతి నాలుగు నెలలకు రూ.2,000 చొప్పున మూడు సమాన వాయిదాలలో సంవత్సరానికి రూ.6,000 ఆర్థిక ప్రయోజనం అందిస్తున్నారు. ఈ నిధి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయబడుతుంది. ఈ పథకం ఫిబ్రవరి 2019లో ప్రారంభించారు.
- Advertisement -