Wednesday, January 22, 2025

డబుల్ ఇంజిన్ ప్రభుత్వాల ఘనత ఇదే : మోడీ

- Advertisement -
- Advertisement -

PM lauds double-engine govt for development

 

న్యూఢిల్లీ : ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి కోసం చేపట్టిన అనేక చర్యలను వివరిస్తూ ఇదంతా డబుల్ ఇంజిన్ ప్రభుత్వాల ఘనత అని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. అస్సాం లోని కర్బి అంగ్‌లాంగ్ జిల్లాలో వివిధ ఆరోగ్య సంరక్షణ, విద్యా సంబంధిత ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అస్సాం లోని డిఫులో వెటరినరీ కళాశాలకు, వెస్ట్ కర్బి అంగ్‌లాంగ్‌లో డిగ్రీ కళాశాలలకు, కోలోంగలో వ్యవసాయ కళాశాలకు మోడీ గురువారం శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్రం లోను రాష్ట్రం లోను బిజేపీ నేతృత్వంలో ప్రభుత్వాలు ఏర్పడటాన్ని డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలని ఆ పార్టీ పిలుస్తున్న సంగతి తెలిసిందే.

కర్బి అంగ్‌లాంగ్ లోని డిపులో శాంతి , ఐక్యత, అభివృద్ధి సభ పేరుతో జరిగిన బహిరంగ సభలో మోడీ మాట్లాడుతూ ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి భద్రతల పరిస్థితులు మెరుగుపడినందువల్ల సాయుధ దశాల ప్రత్యేక అధికారాల చట్టం (ఎఎఫ్‌ఎన్‌పీఏ ) అమలును అస్సాం లోని 23 జిల్లాల్లో, ఈ ప్రాంతం లోని మరికొన్ని ప్రాంతాల్లో రద్దు చేసినట్టు తెలిపారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో అందరితో కలిసి , అందరి అభివృద్ధి , అందరి నమ్మకం , అందరి కృషి, స్ఫూర్తితో పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఇదే స్ఫూర్తితో సరిహద్దుల సమస్యలు కూడా పరిష్కారమయ్యాయని చెప్పారు. ఇటీవల అస్సాంమేఘాలయ మధ్య కుదిరిన ఒప్పందం ఇతరులను కూడా ప్రోత్సహిస్తుందన్నారు. బోడో ఒప్పందం 2020 లో శాశ్వత శాంతికి నూతన ద్వారాలు తెరిచిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News