న్యూఢిల్లీ: ప్రతిపక్ష కూటమి ఇండియాపై ప్రధాని నరేంద్ర మోడీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రతిపక్షాల కూటమి ఏర్పాటు చేసుకున్న పేరును వింటే ఈస్ట్ ఇండియా కంఎపెనీ, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా వంటివి గుర్తుకు వస్తాయని, దేశం పేరు పెట్టుకుని ప్రజలను తప్పుదారి పట్టించలేరని ఆయన వ్యాఖ్యానించారు.
మంగళవారం బిజెపి ర్లామెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని ప్రసంగిస్తూ ప్రతిపక్షాలు నిరాశానిస్పృహలతో ఉన్నాయని, ప్రతిపక్షంలో కూర్చోవాలని నిర్ణయించుకున్నట్లు వాటి ప్రవర్తన కనపడుతోందని ఎద్దేవా చేశారు. ప్రజల మద్దతుతో 2024 ఎన్నికలలో బిజెపి మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తన హయాంలోనే మూడవ సారి ప్రభుత్వం ఏర్పడి ప్రపంచంలోనే మూడు అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగనున్నదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇండియా అని పేరు పెట్టుకున్న అనేక సంస్థల పేర్లను ప్రధాని ప్రస్తావిస్తూ ఆ పేరును పెట్టుకున్నంత మాత్రాన వచ్చే మార్పేమే ఉండబోదని ఆయన అన్నారు.