Monday, December 23, 2024

‘పిఎం’ అంటే పనౌటీ మోడీ : రాహుల్ వ్యాఖ్య

- Advertisement -
- Advertisement -

జైపూర్ : రాజస్థాన్ లో మంగళవారం ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ‘ పీఎం అంటే పనౌటీ మోడీ ’ అని వ్యాఖ్యానించారు. ఆస్ట్రేలియాతో క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్‌లో భారత్ ఓడిపోవడాన్ని ఉదహరిస్తూ ప్రధాని మోడీ దురదృష్టాన్ని (పనౌటీ) తీసుకు వచ్చారన్న అర్ధంలో పనౌటీ అనే పదాన్ని రాహుల్ ఉపయోగించారు. అహ్మదాబాద్ లోని “నరేంద్రమోడీ స్టేడియం” లో జరిగిన క్రికెట్ మ్యాచ్ కు ప్రధాని నరేంద్రమోడీ హాజరయ్యారు.

పారిశ్రామిక వేత్త తన జేబులు నింపుకుంటుంటే మోడీ ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని ఆరోపించారు. ఈ నెల 25 న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బెలోత్రా లోని బేటూలో జరిగిన ర్యాలీని ఉద్దేశించి రాహుల్ ప్రసంగించారు. బడా పారిశ్రామిక వేత్తల రుణాలను మోడీ మాఫీ చేస్తారని, అన్ని ప్రయోజనాలను కల్పిస్తారని విమర్శించారు. అంతకు ముందు ఉదయ్‌పూర్ లోని వల్లభ్ నగర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News