న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ తన 90వ ‘మన్ కీ బాత్’లో 47 ఏళ్ల క్రితపు అత్యవసర స్థితి(ఎమర్జెన్సీ) విధింపును గుర్తు చేశారు. నాడు ప్రజాస్వామ్యాన్ని అణచివేసి, పౌరుల హక్కులను ఎలా కాలరాశారనేది చెప్పారు. తర్వాత ఆయన మ్యూనిచ్ లోని ఇండియన్ డయస్పోరాను ఉద్దేశించి ప్రసంగించారు. ఎమర్జెన్సీ విధింపు దేశ ప్రజాస్వామ్య చరిత్రలో కళంకిత రోజుగా ఆయన అభివర్ణించారు. దేశంలో 1975 జూన్ నెలలో ఎమర్జెన్సీ విధించారని ఆయన గుర్తుచేశారు. నాడు ప్రజల హక్కులన్నింటినీ హరించేశారన్నారు. దేశంలోని ప్రతి సంస్థను నియంత్రణలోకి తీసుకున్నారని చెప్పారు. ఆమోదం లేకుండా ఏదీ ప్రచురితం కాకుండా సెన్సార్ చేశారన్నారు. నాడు గాయకుడు కిశోర్ కుమార్ ప్రభుత్వానికి అనకూలంగా లేకపోవడం వల్ల ఆయన పాటలను రేడియోలో రాకుండా నిషేధించారని గుర్తు చేశారు.
భారత్ లో ఎమర్జెన్సీని 1975 జూన్ 25న విధించారు. తర్వాత 1977 మార్చి 21న దానిని ఎత్తివేశారు.