న్యూఢిల్లీ: ఈసారి తన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జెండా ఎగురవేయడానికి జనం ఉత్సాహంగా ముందుకు వచ్చారని, ఇది తనకు సంతోషం, గర్వం కల్గించిందని ప్రధాని మోడీ తెలిపారు. హర్ ఘర్ తిరంగా ఉద్యమ స్ఫూర్తి నినాదం అయిందన్నారు. దేశంలోని అన్ని వర్గాలకు చెందిన ప్రజలు తమ నినాదాన్ని అందుకుని స్పందించారని, ఇది జాతీయ స్ఫూర్తికి నిదర్శనం అన్నారు. తిరంగా జెండా ఉద్యమ ప్రతిఫలంతో ఆజాదీకా అమృత్ మహోత్సవం ఘనం అవుతుందన్నారు. హర్‌ఘర్ తిరంగా.డాట్‌కామ్ ఏర్పాటు అయిందని, జనం తమ ఇళ్లపై ఎగురవేసిన జెండాల ఫోటోలను దీనికి పంపించవచ్చునని, పంపించిన వారి ఫోటోలను కూడా జతచేయవచ్చునని వివరించారు.
విభజనదశలో బలి అయిన వారికి నివాళి
దేశ విభజన దశలో పలు కష్టాలు అనుభవించి, ప్రాణాలు పోగొట్టుకున్న వారికి ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం నివాళులు అర్పించారు. దేశ విభజన భయానక ఘట్టాల సంస్మరణ దినం ఆగస్టు 14న నిర్వహించుకుంటున్న దశలో మోడీ తమ స్పందన వెలువరించారు. దేశ చరిత్రలో అది ఒక అత్యంత విషాదకర ఘట్టం అని, ఈ రోజులలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన వారిని, త్యాగాలు చేయాల్సి వచ్చిన వారిని, ఏకంగా ప్రాణాలు కోల్పోయిన వారిని, ఆప్తులను దూరం చేసుకుని బతకాల్సి వచ్చిన వారిని అంతా స్మరించుకుందామని ప్రధాని తెలిపారు. 1947లో దేశ విభజన దశలో పాకిస్థాన్ ప్రత్యేకంగా ఏర్పాటు అయినప్పుడు లక్షలాది మంది నిర్వాసితులు కావడం, మతపర ప్రాతిపదికన దూర ప్రాంతాలకు వేలాది మంది అతి కష్టమైన ప్రయాణాల నడుమ సాగిపోవడం. మతకల్లోలాలు సంభవించి పలువురు చనిపోవడం, రక్తపాతాలకు దారితీయడం వంటి ఘటనల బాధాకర మననం విషాదకరమే అప్పటి బాధితులకు తన నివాళి అని ప్రధాని తెలిపారు.
పంద్రాగస్టు దశలో 1082 మంది పోలీసులకు ధైర్యపతాకాలు
విధి నిర్వహణలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన, సేవాస్ఫూర్తిని కనబర్చిన 1082 మంది పోలీసు సిబ్బందికి పతాకాలు ప్రధానం చేశారు. ఇందులో భాగంగా 347 మందికి పిఎంజి పురస్కారాలు, 87 మందికి ప్రెసిడెంట్ పోలీసు మోడల్స్, 648 మందికి సేవా పతకాలు ప్రధానం చేశారు. అత్యధిక ధైర్య సాహస పతకాలు సిఆర్‌పిఎఫ్ సిబ్బందికి అందాయి. జెకె పోలీసు, బిఎస్‌ఎఫ్ బలగాలు తరువాతి క్రమంలో నిలిచాయి.
PM Modi about Har Ghar Tiranga