Monday, December 23, 2024

ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలో తెలియని స్థితిలో విపక్షాలు ఉన్నాయి: మోడీ

- Advertisement -
- Advertisement -

దేశ ప్రజలు బుద్ది చెప్పినా.. ప్రతిపక్షాల్లో మాత్రం మార్పు రావడం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫైర్ అయ్యారు. సోమవారం పార్లమెంట్ లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. ప్రతిపక్షాలపై సెటైర్స్ వేశారు.

దేశంలో జరుగుతున్న అభివృద్దినే రాష్ట్రపతి వివరించారని చెప్పారు.  ప్రతిపక్షాలు ఎప్పుడూ అదే స్థానంలో కూర్చోవాలని తీర్మానించుకున్నాయని.. ఎన్నికలు ఏ విధంగా ఎదుర్కోవాలో తెలియని స్థితిలో విపక్షాలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. మైనార్టీల పేరిట ఎంత కాలం విభజన రాజకీయాలు చేస్తారని ప్రతిపక్షాలపై ఆయన మండిపడ్డారు. ఎన్నికల్లో ఓటమి చెందేందుకే ప్రతిపక్షాలు కష్టపడుతున్నాయన్నారు. ఎంపీగా గెలువలేమని.. కొంతమంది ప్రతిపక్ష నేతలు రాజ్యసభ వైపు వెళ్తున్నారని అన్నారు.దేశంలో ఒక మంచి విపక్షం ఉండాల్సి అవసరం ఉందని మోదీ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News