Tuesday, January 21, 2025

ఝార్ఖండ్‌లో ఆందోళనకరంగా చొరబాట్లు

- Advertisement -
- Advertisement -

ఝార్ఖండ్‌లో చొరబాట్లు ఆందోళనకర స్థాయికి చేరాయని ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ఆరోపించారు. జెఎంఎం నాయకత్వంలోని కూటమి చొరబాటుదారులను ‘ప్రోత్సహిస్తోంది’ అని కూడా మోడీ ఆరోపించారు. ప్రధాని ఆవాస్ యోజన స్థానంలో అధికార ప్రభుత్వం తీసుకువచ్చిన ‘అబువా ఆవాస్’ గృహవసతి పథకం ‘ముడుపులు, కమిషన్’ కోసం ఉద్దేశించిన ‘బోగస్’ పథకం అని ఆయన విమర్శిం0చారు. గోడ్డాలో ఒక ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ, ‘ఝార్ఖండ్‌లో చొరబాట్లు ఆందోళనకర స్థాయిలో సాగుతున్నాయి. రాష్ట్రంలో ‘బేటీ, మాటీ, రోటీ’ (కుమార్తె, తల్లి, రొట్టె) దోపిడీ జరుగుతోంది. జెఎంఎం నాయకత్వంలోని కూటమి చొరబాటుదారులను ప్రోత్సహిస్తోంది. ఆదివాసీల భూములు, అడవి, నీటిని స్వాధీనం చేసుకునేందుకు చొరబాటుదారులకు కూటమి వీలు కల్పిస్తోంది, దీనితో ఆదివాసీల జనాభా క్షీణిస్తోంది’ అని ఆరోపించారు.

అధికార కూటమి ‘మాఫియా రాజ్, ప్రశ్న పత్రాల లీక్’కు పాల్పడడమే కాకుండా అభివృద్ధిని కూడా అడ్డుకున్నదని, దీనితో జనం వలస వెళ్లవలసి వస్తోందని, నిరుద్యోగులుగా కొనసాగవలసి వస్తోందని, అనుసంధానం లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారని కూడా ఆయన ఆరోపించారు. ‘మీ పిల్లల భవిష్యత్తుతో ఆటలాడుకున్న దోషులు పాతాళంలో దాక్కున్నా సరే వారిని బయటకు తెస్తామని మీకు వాగ్దానం చేస్తున్నాను’ అని ప్రధాని తెలిపారు. అనేక కోట్ల రూపాయల మనీ లాండరింగ్ కేసులో జైలులో ఉన్న ఆలంగీర్ ఆలమ్ పేరు ప్రస్తావించకుండా జైలులో ఉన్న నేత భార్యకు టిక్కెట్లు ఇవ్వడం ద్వారా జెఎంఎం కూటమి మీ గాయాలను పెంచిందని ప్రధాని అన్నారు. ఆలమ్ ప్రాతినిధ్యం వహించిన పకూర్ సీటు నుంచి పోటీ అతని భార్య నిషత్ ఆలమ్‌కు కాంగ్రెస్ టిక్కెట్ ఇచ్చింది. ఝార్ఖండ్ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మాజీ మంత్రి ఆలమ్‌ను మనీ లాండరింగ్ కేసులో మే 15ప ఇడి నిర్బంధంలోకి తీసుకున్నది. రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖలో అవకతవకలు, లంచం ఆరోపణలకు గాను ఇడి ఆలమ్‌పై దర్యాప్తు జరుపుతున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News