Sunday, January 19, 2025

కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్న భారతీయ విద్యార్థులు:పిఎం మోడీ

- Advertisement -
- Advertisement -

తిరుచిరాపల్లి: ప్రధాని నరేంద్ర మోడీ భారతీయ ఆవిష్కర్తలపై ప్రశంసల వర్షం కురిపించారు. 2014లో సుమారు 4,000 ఉన్న పేటెంట్లను ఇప్పుడు 50,000 పేటెంట్లకు తీసుకెళ్లిన ఘనతను భారతీయ ఆవిష్కర్తలు సాధించారని ప్రధాని అన్నారు. మంగళవారం ప్రభుత్వ యాజమాన్యంలోని భారతీదాసన్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ప్రధాని మోడీ ప్రసంగించారు. తమిళ కవి భారతీదాసన్ రచించిన కవితలోని పదాలను ప్రధాని మోడీ ఉటంకిస్తూ కొత్త ప్రపంచాన్ని సృష్టించానికి మనమంతా కృషి చేద్దామని విద్యార్థులకు పిలుపునిచ్చారు. భారతీయ యువత ఇప్పటికే నవ్య ప్రపంచాన్ని సృష్టిస్తోందని ఆయన అన్నారు. చంద్రయాన్ వంటి మిషన్ ద్వారా భారతీయ శాస్త్రవేత్తలు ప్రపచం పటంపై స్థానం సంపాదించుకున్నారని ఆయన తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారతీయ పండితులు భారతదేశ వైభవాన్ని ప్రపంచానికి తెలియచేస్తున్నారని,

దేశానికి చెంఇన సంగీతవేత్తలు, కళాకారులు దేశానికి అంతర్జాతీయ అవార్డులను తీసుకువస్తున్నారని మోడీ తెలిపారు. మెరుగైన సమాజం కోసం ప్రజలకు తమ జ్ఞానాన్ని పంచెపెట్టాలని, ఇదే విద్యకు నిజమైన పరమార్థమని ఆయన పేర్కొన్నారు. 1982లో కవి భారతీదాసన్ పేరిట స్థాపించిన ఈ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ప్రసంగించిన తొలి ప్రధాని నరేంద్ర మోడీ కావడం విశేషం. విద్యార్థులతో కొద్దిసేపు ప్రధాని ముచ్చటించారు. ఈ సందర్భంగా ఢిల్లీకి విద్యార్థులు ఎవరైనా వెళతారా అని ప్రధాని ప్రశ్నించగా ఇద్దరు విద్యార్థినులు చేతులు పైకెత్తి తమ సమ్మతిని తెలిపారు. 1894లో జన్మించి 1964లో కన్నుమూసిన కవి భారతీదాసన్‌ను తమిళ విప్లవ కవిగా ప్రధాని మోడీ అభివర్ణించి ఆయన చిత్రపటానికి పుష్పనివాళి అర్పించారు. విద్యార్థులు, గవర్నర్ ఆర్‌ఎన్ రవి, ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌తో కలసి ఆయన గ్రూప్ ఫోటో దిగారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News