Thursday, January 23, 2025

కాంగ్రెస్ భట్టి విక్రమార్కను అవమానించింది: ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

నాగర్ కర్నూల్: ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే.. ప్రజలు ఓ నిర్ణయానికి వచ్చారని నాగర్ కర్నూల్ బిజెపి బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గతంలో ఉన్న బిఆర్ఎస్, ప్రస్తుతం అధికారంలో కాంగ్రెస్ పార్టీలపై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్లీ బిజెపిని గెలిపించాలని ప్రజలు నిర్ణయానానికి వచ్చారన్నారు. నాగర్ కర్నూలు ప్రజలు కూడా ఈ సారి బిజెపిని గెలిపించాలని ప్రధాని ప్రజలను కోరారు. నిన్న మల్కాజ్ గిరిలో బిజెపి ర్యాలీ బ్రహ్మాండంగా సాగిందన్నారు. మల్కాజ్ గిరిలో ప్రజలు వీధుల్లో బారులు తీరి బిజెపికి మద్దతు తెలిపారని ప్రధాని స్పష్టం చేశారు. బిఆర్ఎస్ పట్ల తమ కోపాన్ని ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో చూపారన్న ప్రధాని సార్వత్రిక ఎన్నికల్లో మూడోసారి కూడా బిజెపినే గెలిపించాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారని ఆయన పేర్కొన్నారు.

పదేళ్లుగా బిఆర్ఎస్, కాంగ్రెస్ తెలంగాణ ప్రజల కలలను చిదిమేశాయన్నారు. పదేళ్లుగా బిఆర్ఎస్ అవినీతికి పాల్పడితే.. ఇప్పుడు తమ వంతు వచ్చిందని కాంగ్రెస్ భావిస్తోందన్నారు. తెలంగాణను దక్షిణ భారతానికి ముఖ ద్వారమని చెబుతున్నారు. తెలంగాణలోనూ ఈ సారి బిజెపికి 400 సీట్లు అనే నినాదం వినిపిస్తోందన్నారు. బిజెపిను గెలిపించండి.. మీ ఆకాంక్షలను బిజెపి నెరవేరుస్తోందని ప్రధాని భరోసా ఇచ్చారు. మీ అభివృద్ధి కోసం నేను రాత్రి, పగలు ఏకం చేస్తానన్నారు. తెలంగాణను నాశానం చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి ఈ ఐదేళ్లు చాలు.. బిజెపి ఎంపిలను భారీ సంఖ్యలో గెలిపిస్తే.. అప్పుడు కాంగ్రెస్ ఆటలు సాగవని ఆయన తెలిపారు.

కాంగ్రెస్ గరీబీ హఠావో అని దశాబ్దాల క్రితమే నినాదం ఇచ్చింది.. కానీ పేదరికం పోయిందా? అని ప్రధాని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలన అంతా మోసం, దోపిడీ మాత్రమేనన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబిసీలను కాంగ్రెస్ ఓటు బ్యాంకుగానే చూసిందన్నారు. బిజెపికి పూర్తి మెజారిటీ వచ్చిన తర్వాతే దేశంలో మార్పు మొదలైందన్నారు. మార్పునకు గ్యారంటీ.. మోడీ గ్యారంటీ మాత్రమేనన్నారు. నేను నా కోసం.. ఒక్క రోజు కూడా వినియోగించుకోలేదు… నేను రేయింబగళ్లు 140 కోట్ల ప్రజల కోసమే పని చేస్తున్నానని తెలిపారు. మోడీ చెప్పాడంటే.. అది చేసి తీరుతాడన్నారు. ఆర్టీకల్ 370, అయోధ్య రామాలయ నిర్మాణం ఇందుకు కొన్ని ఉదాహరణలు అన్నారు. గత 23 ఏళ్లుగా సిఎంగా, పిఎంగా ప్రజలకు సేవలు అందిస్తున్నా.. నేను నా కోసం.. ఒక్క రోజు కూడా వినియోగించుకోలేదన్నారు.

తెలంగాణ ప్రజల కోసం కోటి బ్యాంకు ఖాతాలు తెరిచాం.. కోటిన్నర మంది తెలంగాణ ప్రజలకు ఆరోగ్య బీమా కల్పించామన్నారు. తెలంగాణలో 67 లక్షల మందికి ముద్రా రుణాలు అందించామని ప్రధాని చెప్పారు. తెలంగాణలో మాదిగలను బలోపేతం చేసేందుకు నిర్ణయించామని పేర్కొన్నారు. తెలంగాణలో 80 లక్షమ మంది ఆయుష్మాన్ పథకం కింద లబ్ది పొందారని చెప్పారు. బిజెపి పాలనలో అధిక లాభం ఎస్సీ, ఎస్టీ, ఓబిసి, రైతులకే దక్కుతుందన్నారు.

కాంగ్రెస్ సామాజిక న్యాయం పేరుతో రాజకీయంగా పబ్బం గడుపుకుంటోందన్నారు. ఎస్సీ, ఎస్టీ,ఓబిసిలను కాంగ్రెస్ ఎప్పుడూ అవమానిస్తూనే ఉందని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ గతంలో అంబేద్కర్ ను సైతం ఎన్నికల్లో ఓడించిందని పేర్కోన్నారు. గిరిజన మహిళ ముర్మును రాష్ట్రపతి ఎన్నికల్లో ఓడించేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కూడా యాదాద్రిలో కాంగ్రెస్ అవమానించిందని ప్రధాని మోడీ గుర్తుచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News