Monday, January 20, 2025

ఎవరెన్ని చెప్పినా మళ్లీ ప్రధాని మోడీనే: అమిత్ షా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: విపక్షాల సమావేశాలపై బిజెపి నేతలు అమిత్ షా, జెపి నడ్డా శుక్రవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విపక్షాలు ఎప్పటికీ ఏకతాటిపైకి రాలేవని అమిత్ షా జోస్యం చెప్పారు. ఎవరెన్ని చెప్పినా మళ్లీ ప్రధాని మోడీనే అన్నారు. వచ్చే ఎన్నికల్లో 300పైగా సీట్లు గెలుస్తామని షా ధీమా వ్యక్తం చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్, నీతీశ్ కుమార్ పట్ల గతంలో కాంగ్రెస్ దారుణంగా ప్రవర్తించిందని జెపి నడ్డా పేర్కొన్నారు. లాలూ, నీతీశ్ ను రాహుల్ నానమ్మ ఇందిర జైల్లో పెట్టించారని నడ్డా వెల్లడించారు. ఇప్పుడు రాహుల్ లాలూ, నీతీశ్ స్వాగతం పలుకుతున్నారని మండిపడ్డారు. ఈ రాజకీయ సిత్రాలు చూసి ఆశ్చర్యపోతున్నానని నడ్డా పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News