Monday, December 23, 2024

లోక్ సభ సభ్యులుగా ప్రమాణం చేసిన మోడీ, అమిత్ షా

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: లోక్ సభ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతోంది. కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. 18వ లోక్ సభ సమావేశంలో కొత్తగా ఎన్నికైన ఎంపిలు ఇవాళ, రేపు ప్రమాణ స్వీకారాలు చేయనున్నారు. లోక్‌సభలో ఎంపి ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మంత్రులు రాధామోహన్ సింగ్, రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, ఫగ్గన్ సింగ్ కులస్తే, నితిన్ గడ్కరీ, శివరాజ్‌సింగ్ చౌహాన్, రామ్మోహన్ నాయుడు కింజారపు, తదితరులు లోక్ సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం లోక్ సభలో అడుగుపెట్టేవారిలో సగానికి పైగా కొత్తవారే ఉన్నారు.

మొత్తం 543 మంది సభ్యుల్లో 280 మంది సభ్యులు కొత్తవారు ఉండగా 262 మంది గతంలో లోక్ సభలో సభ్యులుగా పని చేసిన అనుభవం ఉంది. లోక్ సభలో బిజెపి 240, కాంగ్రెస్ 99, సమాజ్‌వాదీ 37, టిఎంసి 29, డిఎంకె 22, టిడిపి 16. జెడియు 12 మంది సభ్యలు ఉండగా మొత్తం 41 పార్టీలక సంబంధించిన సభ్యులు ఉన్నారు. సభ్యుల ప్రమాణస్వీకారం అనంతరం ఎల్లుండి లోక్‌సభ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. ఈ నెల 27న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపతి ముర్మూ ప్రసంగించనున్నారు. వయనాడ్ స్థానానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజీనామా చేశారని ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ తెలిపారు. రాహుల్ గాంధీ రాజీనామాను ఆమోదించామని ప్రొటెం స్పీకర్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News