- Advertisement -
న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నికకు శనివారం పోలింగ్ కొనసాగుతోంది. ప్రధాని మోడీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే పలువురు ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. తెలంగాణ ఎంపీలు కూడా ఓటేశారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. 5 గంటల తర్వాత ఎన్నికల ఫలితాలు కూడా వెలువడనున్నాయి. ఎన్డీఏ అభ్యర్థిగా జగదీప్ ధన్‌కర్, విపక్షాల అభ్యర్థిగా మార్గరేట్ అల్వాలు పోటీపడుతున్నారు. సాయంత్రం దేశానికి కొత్త ఉపాధ్యక్షుడి పేరును రిటర్నింగ్ అధికారి ప్రకటిస్తారు. కొత్త ఉప రాష్ట్రపతి ఆగస్టు 11న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ఆగస్టు 10తేదీన ముగియనుంది.
- Advertisement -