Saturday, December 21, 2024

నేపాల్ ప్రధాని ప్రచండతో ప్రధాని మోడీ భేటీ!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ, నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ ‘ప్రచండ’ గురువారం ఇంధనం, కెనెక్టివిటీ, వాణిజ్యం సహా అనేక రంగాలలో భారత్‌నేపాల్ సహకారాన్ని పెంపొందించుకునే విషయంలో విస్తృత చర్చలు జరిపారు. నేపాల్ ప్రధాని నాలుగు రోజుల పర్యటనపై బుధవారం భారత్ వచ్చారు. 68 ఏళ్ల కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్‌మావోయిస్ట్(సిపిఎన్‌మావోయిస్ట్) నాయకుడు 2022 డిసెంబర్‌లో అత్యున్నత పదవిని చేపట్టిన తర్వాత చేస్తున్న తొలి ద్వైపాక్షిక పర్యటన ఇది. నేపాల్, భారత్ మధ్య ఇరుగుపొరుగు సంబంధాలున్నాయి. రెండు దేశాల ప్రజల్లో పెళ్లి సంబంధాలు కూడా ఉన్నాయి. నలుదిక్కుల భూభాగమే ఉన్న నేపాల్ వస్తు, సేవల రవాణాకు భారత్‌పై ఆధారపడుతుంది. నేపాల్, భారత్‌లోని సిక్కిం, పశ్చిమబెంగాల్, బీహార్, ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలతో 1850 కిమీ. సరిహద్దు కలిగి ఉంది. నేపాల్‌కు సముద్ర మార్గం ఇండియా నుంచే. నేపాల్ భారత్‌ల మధ్య శాంతి, స్నేహ ఒప్పందం 1950లో జరిగింది. అప్పటి నుంచి ఈ రెండు దేశాల మధ్య ప్రత్యేక సంబంధాలున్నాయి.
ప్రచండ ప్రతినిధి బృందంలో ఉన్న నేపాల్ విదేశాంగ మంత్రి ఎన్‌పి. సౌద్ బుధవారం మాట్లాడుతూ ద్వైపాక్షిక చర్చల్లో వాణిజ్యం, రవాణా, కనెక్టివిటీ, సరిహద్దు సమస్యలతో సహా అనేక రకాల అంశాలు చోటుచేసుకున్నాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News