- Advertisement -
తిరుపతి: వైకుంఠ ఏకాదశి సర్వదర్శనం కోసం టోకెన్లు జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని మోడి అన్నారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాల సాయం అందిస్తోందని తెలిపారు. ఈ ప్రమాదంపై స్పందించిన రాహుల్ గాంధీ.. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ ఘటనపై డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్, మంత్రులు అనిత, నిమ్మల విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తీవ్ర ఆవేదనకు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో ఆరుగురు చనిపోవడం అత్యంత బాధాకరమని ఎపి హోంమంత్రి అనిత అన్నారు. తిరుపతి ఎస్పీతో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
- Advertisement -