Monday, January 20, 2025

అతి పెద్ద స్టాక్ మార్కెట్ స్కామ్ వెనుక మోడీ, షా : రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అత్యంత పెద్ద స్టాక్ మార్కెట్ స్కామ్ లో ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా నేరుగా పాలుపంచుకున్నారని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గురువారం ఆరోపించారు. ఆ స్కామ్ లో రిటైల్ ఇన్వెస్టర్లు రూ. 30 లక్షల కోట్లు నష్ఠపోయారని ఆరోపించారు. ఈ విషయంలో సంయుక్త పార్లమెంటరీ కమిటీతో దర్యాప్తు జరిపించాలని కూడా రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.

ఎగ్జిట్ పోల్స్ తర్వాత స్టాక్ మార్కెట్ కృతకంగా పెరిగిందన్నారు. ఆ తర్వాత మరునాడు జూన్ 4న లోక్ సభ ఓట్ల లెక్కింపు మొదలు కాగానే స్టాక్ మార్కెట్ కుప్పకూలిందన్నారు. రిటైల్ ఇన్వెస్టర్లు రూ. 30 లక్షల కోట్లు నష్టపోయారని, ఇదో పెద్ద స్టాక్ మార్కెట్ స్కామ్ అని రాహుల్ గాంధీ తెలిపారు.

పోలింగ్ అప్పుడు హోం మంత్రి అమిత్ సా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తొలిసారి స్టాక్ మార్కెట్ పై వ్యాఖ్యానించారు. పెట్టుబడిపై ప్రధాని, హోం మంత్రి ఎందుకు ప్రజలకు సలహాలిస్తున్నారని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ‘‘మేము అతి పెద్ద స్టాక్ మార్కెట్ కుంభకోణంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ దర్యాప్తును కోరుతున్నాం’ అని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News