Friday, December 20, 2024

భారత్ బంగ్లా సంయుక్త ప్రాజెక్టులు.. మోడీ హసీనాలతో ప్రారంభం

- Advertisement -
- Advertisement -

అగర్తలా : భారత్ బంగ్లా సంయుక్త ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోడీ, బంగ్లా ప్రధాని షేక్ హసీనా బుధవారం వర్చువల్ పద్ధతిలో ఒకేసారి ప్రారంభించారు. ఇందులో ప్రధానమైనది రైలు అనుసంధాన మార్గం. త్రిపురలోని నిశ్చింతపుర్ , బంగ్లాదేశ్‌లోని గంగాసాగర్ వరకూ సాగుతుంది. ఇరుదేశాల మధ్య సరిహద్దు జిల్లాల ప్రజలకు రైలు ప్రయాణాలకు వీలేర్పడుతుంది. ఇక 65 కిలోమీటర్ల ఖుల్నా మోంగ్లా పోర్టు రైలు లైన్, బంగ్లాదేశ్‌లోని రాంపాల్‌లో మైత్రీ సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ రెండో యూనిట్‌ను కూడా ఇరుదేశాల ప్రధానులు ప్రారంభించారు. త్రిపుర రాజధాని అగర్తలాకు సమీపం నుంచి బంగ్లాదేశ్‌లోని అఖౌరా వరకూ ఉండే సీమాంతర సరిహద్దు రైలు మార్గంతో ఇరుదేశాల మధ్య ప్రయాణ,

వాణిజ్య సంబంధాలు మరింతగా ఇనుమడించేందుకు వీలేర్పడుతుంది. ఈ మార్గం వల్ల అగర్తలా చ కోల్‌కతా మధ్య ఢాకా మీదుగా ప్రయాణ కాలం గణనీయంగా తగ్గుతుంది. ఈ రైలు మార్గం ఆరంభం ఇరుదేశాల మధ్య చారిత్రక పరిణామం అని ప్రధాని మోడీ తెలిపారు. ఈ రైలు అనుసంధాన మార్గం ఈశాన్య భారతం, బంగ్లాదేశ్‌ల నడుమ తొలి రైలు అనుసంధాన ప్రక్రియ అని వివరించారు. దీని వల్ల ఇరుదేశాల మధ్య స్నేహసంబంధాలు మరింతగా విస్తరించుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రైలు మార్గం గుండా తొలి రైలు బుధవారం అగర్తలా సమీపంలోని స్టేషన్‌కు చేరుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News