Tuesday, January 21, 2025

ఎఫ్‌టిఎపై మోడీ సునాక్ చర్చలు

- Advertisement -
- Advertisement -

లండన్ : భారత్, బ్రిటన్ మధ్య ప్రతిష్టాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టిఎ) కుదిరే దిశలో ప్రధాని మోడీ, రిషి సునాక్ మధ్య విస్తృత చర్చలు జరిగాయి. జపాన్‌లోని హిరోషిమాలో జి 7 సదస్సు నేపథ్యంలో ఇరువురు ప్రధానులు ఈ విషయంలో పురోగతిని సమీక్షించుకున్నారు. సాధ్యమైనంత త్వరగా ఇరుదేశాల నడుమ ఎఫ్‌టిఒ కుదరాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని బ్రిటన్‌లోని ప్రధాని కార్యాలయం డౌనింగ్ స్ట్రీట్ అధికారులు ఆదివారం తెలిపారు. ఇండోనేసియాలో జి 20 సదస్సు తరువాత ఇద్దరు నేతలు ముఖాముఖి కలుసుకోవడం ఇదే తొలిసారి.

ఎఫ్‌టిఒ ఖరారు కోసం ఇరు దేశాల వాణిజ్య ప్రతినిధి బృందాలు తమ సంప్రదింపులను క్రియాశీలకం చేయాల్సి ఉంటుందని, ఒప్పందం సాధ్యమైనంత త్వరగా కుదిరేలా చూసేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు అధికార ప్రకటనలో తెలిపారు. ఇరుదేశాల నడుమ పలు ద్వైపాక్షిక విషయాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. భారతీయ సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని అయిన తరువాత ఇరు దేశాల మధ్య ఎఫ్‌టిఒ, తద్వారా వాణిజ్య సంబంధాలు మరింత ఇనుమడించేందుకు సరైన వాతావరణం ఏర్పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News