Thursday, January 23, 2025

ఐదేళ్లపాటు ఉచిత రేషన్ : ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్ : ఆహార భద్రత చట్టం కింద పేదలకు ఇస్తున్న ఉచిత రేషన్ సదుపాయాన్ని డిసెంబర్ తర్వాత కూడా మరో ఐదేళ్లపాటు పొడిగించనున్నట్టు ప్రధాని మోడీ ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్‌లో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. దేశంలో 80 కోట్ల మందికి రానున్న ఐదేళ్లపాటు వీటిని అందించనున్నాం. కాంగ్రెస్‌కు పేదలంటే చిన్నచూపు.

పేదలు ఎప్పుడూ పేదలు గానే ఉండాలని ఆ పార్టీ కోరుకుంటుందని కాంగ్రెస్ పార్టీపై ప్రధాని విమర్శలు గుప్పించారు. ఐదేళ్ల పాటు కాంగ్రెస్ అవినీతిని భరించారని, మరో 30 రోజుల్లో ఆ సమస్య సమసి పోతుందంటూ ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడారు. కొవిడ్ నుంచి ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద ఉచిత రేషన్ అందిస్తున్నారు. మూడేళ్లుగా ఈ పథకం అమలవుతోంది. డిసెంబర్‌తో ఈ పథకం ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఈ ప్రకటన చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News