Monday, December 23, 2024

కోవిడ్-19 వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు నెలకు రూ. 4,000: మోడీ ప్రకటన

- Advertisement -
- Advertisement -

 

Narendra Modi

న్యూఢిల్లీ: ‘పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్’ పథకం కింద ప్రయోజనాలను విడుదల చేస్తూ, కోవిడ్-19 కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల రోజువారీ అవసరాలను తీర్చేందుకు వివిధ పథకాల ద్వారా రూ.4,000 అందించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ప్రకటించారు. “ఎవరైనా ప్రొఫెషనల్ కోర్సుల కోసం, ఉన్నత విద్య కోసం ఎడ్యుకేషన్ లోన్ కావాలంటే, ‘పిఎం కేర్స్’ దానికి కూడా సహాయం చేస్తుంది” అని ప్రధాని మోడీ అన్నారు. అంతే కాకుండా 18 నుంచి 23 ఏళ్ల లోపు వారికి స్టైఫండ్ అందజేస్తామని  ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలకు వెళ్లే పిల్లలకు స్కాలర్‌షిప్‌లు బదిలీ చేయబడ్డాయి, అలాగే పిల్లల కోసం పిఎం కేర్స్ యొక్క పాస్‌బుక్ ,  ఆయుష్మాన్ భారత్ కింద ఒక హెల్త్ కార్డ్ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ కూడా హాజరయ్యారు.

నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం నేటితో ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంది. 2019లో తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుండి, ఇది తన ఎజెండాలోని అనేక కీలక విషయాలను తనిఖీ చేసింది. ఏది ఏమైనప్పటికీ, ప్రభుత్వంకు ఇంకా మిగిలి ఉన్న రెండవ పదవీకాలానికి ఇటు స్వదేశంలోనూ అటు  విదేశాలలోనూ అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి.

గత ఏడాది మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్న తర్వాత ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడం దగ్గర నుండి వ్యవసాయ రంగాన్ని సంస్కరించడం వరకు మోడీ ప్రభుత్వం అన్ని రంగాలలో సవాళ్లను ఎదుర్కొంటోంది. అంతేకాకుండా, పొరుగు దేశాలైన పాకిస్తాన్, శ్రీలంకలో నెలకొన్న కల్లోలం, ఉపఖండంలో భారతదేశ నాయకత్వం భవిష్యత్తులో పరీక్షించబడగలదనిపిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News