Monday, December 23, 2024

రేపటి క్రికెట్ మ్యాచ్‌కు భారత్, ఆస్ట్రేలియా ప్రధానులు

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ, ఆస్ట్రేలియా ప్రధాని ప్రధాని ఆంథోనీ అల్బనెసేతో కలిసి ఈ నెల 8న జరిగే ఇరుదేశాల నాలుగో చివరి క్రికెట్ టెస్టు మ్యాచ్ తొలిరోజు ఆటను వీక్షిస్తారు. గురువారం భారత్, ఆస్ట్రేలియా మధ్య ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది.

ఆస్ట్రేలియా ప్రధాని భారతదేశంలో అధికార పర్యటనకు వస్తున్న దశలో జరిగే ఈ బార్డర్ గవాస్కర్ ట్రాఫీ సీరిస్ చివరి మ్యాచ్ జరుగుతుంది. నాలుగు టెస్టు మ్యాచ్‌ల ఈ సీరిస్‌లో ఇప్పటికే ఇండియా రెండింట్లో గెలిచింది. కాగా ఇండోర్‌లో జరిగిన మూడో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలిచింది. ఈ విధంగా ఇండియా జట్టు 21 లీడ్‌తో ఉంది. అహ్మదాబాద్‌లోని ఇంతకు ముందటి మోటేరా స్టేడియానికి ప్రధాని మోడీ పేరు పెట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News