Monday, January 20, 2025

కొత్త ప్రభుత్వం తొలి 100 రోజులకు రోడ్‌మ్యాప్ ముసాయిదా

- Advertisement -
- Advertisement -

కొత్త ప్రభుత్వం కోసం తొలి 100 రోజులకు, వచ్చే ఐదు సంవత్సరాలకు ఒక రోడ్‌మ్యాప్ రూపొందించవలసిందని మంత్రులను ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం కోరారు. ఆదివారం ఉదయం మంత్రివర్గ సమావేశానికి ప్రధాని మోడీ అధ్యక్షత వహిస్తూ, తొలి వంద రోజులకు, వచ్చే ఐదు సంవత్సరాలకు అజెండాను ఎలా అమలు చేయాలో చర్చించేందుకు తమ తమ మంత్రిత్వశాఖల కార్యదర్శులను, ఇతర అధికారులను కలుసుకోవలసిందిగా కూడా మంత్రులను కోరారు.

2024 లోక్‌సభ ఎన్నికలకు కార్యక్రమాన్ని ఎన్నికల కమిషన్ ప్రకటించిన మరునాడు మంత్రివర్గ సమావేశం జరిగింది. ఎన్నికల కమిషన్ సిఫార్సును రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపడం ద్వారా ఏడు దశల పార్లమెంటరీ ఎన్నికల తేదీలను నోటిఫై చేసే ప్రక్రియను కూడా మంత్రివర్గంప్రారంభించింది. తొలి నోటిఫికేషన్‌ను 102 సీట్లకు సంబంధించి ఏప్రిల్ 19న మొదటి దశ పోలింగ్ కోసం ఈ నెల 20న జారీ చేస్తారు. నోటిఫికేషన్ జారీ అయిన తరువాత సంబంధిత దశకు నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News