Monday, December 23, 2024

బాధ్యులపై కఠిన చర్యలు.. ఘటనాస్థలికి వెళ్లి ప్రధాని సమీక్ష

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఒడిషాలోని బాలాసోర్‌జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదాలకు బాధ్యులు అయిన వారిని తీవ్రంగా శిక్షిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం తెలిపారు. ఘటనాస్థలికి వైమానిక దళ హెలికాప్టర్‌లో వెళ్లి పరిస్థితిని సమీక్షించుకున్న తరువాత ప్రధాని కొద్ది సేపు మాట్లాడారు.

ఇది చాలా బాధాకరమైన దుర్ఘటన అని మృతుల కుటుంబాలను ఆదుకోవడం, గాయపడ్డ వారిని చికిత్సలకు పంపించడం ఇతరత్రా సాయం విషయంలో పూర్తిస్థాయిలో చర్యలు ఉంటాయని తెలిపిన ప్రధాని ఈ ఘటనలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతోందని, బాధ్యులు తేలితే వారిపై కఠిన శిక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. ఒడిషాకు ప్రధాని మోడీ వెంట రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ , కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ,రైల్వే ఉన్నతాధికారులు వెళ్లారు. అంతకు ముందు రాజధానిలో ప్రధాని ఈ ఘటనపై ఉన్నత స్థాయి సమీక్ష చేపట్టారు. హోం మంత్రి అమిత్ షా, సీనియర్ అధికారులు ఈ భేటీకి హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News