Saturday, March 1, 2025

వివిధ రంగాల ప్రముఖులతో ప్రధాని మోడీ భేటీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ఢిల్లీలో ఎన్‌ఎక్స్‌టి కాన్‌క్లేవ్‌లో రాజకీయాలు, విద్యా సంస్థలతో సహా వివిధ రంగాలకు చెందిన ప్రపంచ ప్రముఖులు పలువురితో సమావేశమై, వారితో అభిప్రాయాలు పంచుకున్నారు. ఆ సమావేశాల పట్ల మోడీ హర్షం వ్యక్తం చేస్తూ, వారు తమ తమ రంగాల్లో చేసిన కృషిని ’ఎక్స్’ పోస్టులలో శ్లాఘించారు. ‘నా ప్రియ మిత్రుడు, ఆస్ట్రేలియన్ మాజీ ప్రధాని టోనీ అబాట్‌ను కలుసుకున్నందుకు ఆనందిస్తున్నాను. ఆయన ఎల్లప్పుడూ భారత్‌కు మిత్రుడు. ప్రస్తుత పర్యటనలో ఆయన చిరు ధాన్యాలను ఆస్వాదించడం మేమంతా చూశాం’ అని మోడీ తెలియజేశారు.

మోడీ శ్రీలంక మాజీ ప్రధాని రణిల్ విక్రమసింఘెతో కూడా భేటీ అయ్యారు. ఆయనతో సంభాషణల కోసం తాను సదా ఎదురుచూస్తుంటానని తెలిపిన మోడీ వివిధ అంశాలపై ఆయన దృక్పథాన్ని అభినందించారు. మోడీ కలుసుకున్న వారిలో కార్లోస్ మోంటెస్, జోనాథన్ ఫ్లెమింగ్ కూడా ఉన్నారు. సామాజిక సృజనల ప్రోత్సాహానికి మోంటెస్ ఎంతగానో తోడ్పడ్డారని, డిజిటల్ టెక్నాలజీ, ఫిన్‌టెక్ మొదలైన రంగాల్లో భారత్ పురోగతిని కొనియాడారని మోడీ తెలిపారు.

ఎంఐటి స్లోన్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌తో సంబంధం ఉన్న ఫ్లెమింగ్ ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు రెండింటిలో విశిష్ట కృషి సలిపారు.పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో ఆన్ లైబెర్ట్ కృషి ప్రశంసనీయమని, మున్ముందు పలువురి జీవన ప్రమాణం మెరుగుపడేలా చూడగలరని ఆమెతో సమావేశం అనంతరం మోడీ తెలిపారు. మోడీ నాసా మాజీ వ్యోమగామి మైక్ మాస్సిమినో, రష్యన్ వ్యోమగామి ఒలెగ్ అర్తెమియేవ్, సృజన నిపుణుడు అలెక్ రోస్, ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త బ్రియాన్ గ్రీన్, అంతర్జాయ సంబంధాలు భౌగోళిక రాజకీయాల్లో నిపుణుడు వెసెలిన్ పొపోవ్‌స్కీని కూడా కలుసుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News