Monday, December 23, 2024

సంపన్న దేశాల విశ్వాసఘాతం దారుణం

- Advertisement -
- Advertisement -

దెబ్బతిన్న సరఫరా వ్యవస్థ పాపం వారిదే
పసిఫిక్ దీవుల దేశాల సదస్సులో ప్రధాని మోడీ
గ్లోబల్ సౌత్ పట్ల నిర్లక్ష్య వైఖరితో ముప్పు

పోర్టు మోర్స్‌బై : సంపన్న దేశాలు తరచూ కృతఘ్నతతోనే వ్యవహరిస్తూ ఉంటాయని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. వారి పట్ల మనం నమ్మకం పెంచుకుంటే చివరికి అవసరం అయినప్పుడు వారు ఎటువంటి సాయానికి ముందుకు రారని , అవసరానికి ఆదుకోని వారి వైఖరిని ఎమనాల్సి ఉంటుందని ప్రశ్నించారు. జపాన్ జి 7 సమ్మిట్ తరువాత పపూవా న్యూ గియానాకు వచ్చిన ప్రధాని మోడీ అక్కడ జరిగిన మూడవ ఇండియా 14 పసిఫిక్ ఐలాండ్ దేశాల సంయుక్త సదస్సులో (ఫిపిక్ ) మాట్లాడారు. సంపన్న దేశాలను తరచూ అణగారిన స్థితిలో ఉన్న దక్షిణాది దేశాలు ఎక్కువగా విశ్వసిస్తూ ఉంటాయి. తమ కష్టాలలో ఆదుకుంటాయని సంపన్న దేశాల వైపు చూస్తాయి. అయితే ఆ అభివృద్ధి చెందిన దేశాల వైఖరి ఇందుకు భిన్నంగా ఉంటుందని వ్యాఖ్యానించారు.

పలు కారణాలతో ఇప్పుడు పలు రకాల సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు తలెత్తాయి. ఓ విధంగా దీనికి సంపన్న దేశాల ధోరణి కారణం. అయితే ఇంధన, ఆహార, ఔషధ, ఎరువుల సరఫరాల విషయాలలో తలెత్తిన లోపాలను సరిదిద్దేందుకు సంపన్న దేశాలు ముందుకు రావడం లేదని విమర్శించారు. వారి నుంచి సాయం అందుతుందనుకుంటే వారు విశ్వాసఘాతుకానికి పాల్పడుతున్నారని, దీనితో పేద దేశాల పరిస్థితి దయనీయంగా ఉందని పేర్కొన్నారు. కోవిడ్ మహమ్మారి దశలో గ్లోబల్ సౌత్ తీవ్రస్థాయిలో చిక్కుల్లో పడింది. పలు ఆటుపోట్లు ఎదురయ్యాయని, తరచూ వచ్చిపడే వాతావరణ, పర్యావరణ సవాళ్లు, ప్రకృతి వైపరీత్యాలు , ఆకలి దప్పులు , అనారోగ్య సమస్యల నడుమ పరిస్థితి దయనీయంగా ఉన్న దేశాల పట్ల ఎటువంటి స్పందన ఉందనేది తెలిసిందే అన్నారు.

మరెన్నో సరికొత్త సమస్యలు వచ్చిపడుతున్నాయని తెలిపిన ప్రధాని క్లిష్ట పరిస్థితుల నడుమ ఈ మిత్ర పసిఫిక్ దీవుల దేశాలకు భారతదేశం వెన్నుదన్నుగా నిలవడం పట్ల తాను గర్విస్తున్నానని తెలిపారు. ప్రపంచ వేదికపై భారతదేశపు నాయకత్వ పటిమను ఈ వేదిక నుంచి పపూవా న్యూ గియానా ప్రధాని జేమ్స్ మారాపై కొనియాడారు. భారతదేశం అందిస్తున్న సాయానికి ధన్యవాదాలు చెప్పారు. గ్లోబల్ సౌత్‌కు ప్రధాని మోడీ నాయకుడు అని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్త అధికార దాహానికి, చెలగాటానికి మన మంతా బలి అవుతున్నామని , ఈ దశలో ప్రపంచ వేదికలపై భారత నాయకత్వానికి తాము అండగా ఉంటామన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News