Wednesday, January 22, 2025

వందేళ్లకోసారి వచ్చే సమస్య… వంద రోజుల్లో పరిష్కరించలేం

- Advertisement -
- Advertisement -

PM Modi at the start of Rozgar Mela of 10 lakh jobs

10 లక్షల ఉద్యోగాల రోజ్‌గార్ మేళా ప్రారంభంలో ప్రధాని మోడీ

న్యూఢిల్లీ : యువత కోసం అత్యధిక ఉద్యోగాలను సృష్టించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ చెప్పారు. ప్రపంచ దేశాల పరిస్థితులు అంత బాగా లేవని, చాలా దేశాల్లో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, శిఖరస్థాయిలో ఉందన్నారు. వందేళ్లకోసారి వచ్చే మహమ్మారి ప్రభావం 100 రోజుల్లో అంతం కాబోదని చెప్పారు. 10 లక్షల మందికి ఉద్యోగాలిచ్చే రోజ్‌గార్ మేళాను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రధాని మోడీ శనివారం రోజ్‌గార్ మేళాను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు. 75 వేల మంది ప్రభుత్వ ఉద్యోగార్థులకు నియామక లేఖలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి కల్పన, స్వయం ఉపాధి కోసం, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో ఇదో కీలక మైలురాయి అని అభివర్ణించారు.

కొవిడ్ 19 మహమ్మారి ప్రభావం మనదేశం పైనా, ప్రపంచ దేశాల పైనా ఏ విధంగా ఉందో వివరించారు. ఈ మహమ్మారి తర్వాత అనేక దేశాలు ఎదుర్కొంటున్న ఆర్థిక కష్టాల దెబ్బ మన దేశంపై తక్కువగా ఉండేలా చేయడం కోసం నిరంతరం శ్రమిస్తున్నామని చెప్పారు. ఈ సమస్యల ప్రభావం పడకుండా మనదేశాన్ని కాపాడుకోవడం కోసం భారత దేశం అనేక నూతన చర్యలను చేపడుతోందని, కొన్ని రిస్క్‌లను కూడా చేస్తోందని తెలిపారు. ఇది సవాలుతో కూడుకున్న వ్యవహారం, మీ (ప్రజల) ఆశీర్వాదంతో మనం ఇప్పటివరకు సురక్షితంగా ఉన్నాం” అని చెప్పారు. ప్రపంచ వ్యాప్తగా భారత్ ఐదో ఆర్థిక శక్తిగా అవతరించడంపై మోడీ హర్షం వ్యక్తం చేశారు. గత ఎనిమిదేళ్లలో మన దేశం 10 వ స్థానం నుంచి 5 వ స్థానానికి ఎగబాకిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన యువతకు మోడీ నియామక పత్రాలను పంపించగా, వాటిని మంత్రులు, ఎంపీలు అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News