న్యూఢిల్లీ : లోక్ సభలో అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో ప్రధాని మోడీ విపక్షాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష కూటమి ఇండియా 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు సెమీఫైనల్‌ని కోరుకుంటోందని, ఫలితాలు అందరూ చూడాలని బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో వ్యాఖ్యానించారు. రాజ్యసభ ఆమోదించిన వివాదాస్పద ఢిల్లీ సర్వీసెస్ బిల్లుపై జరిగిన రచ్చను కూడా ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. పరస్పర అవిశ్వాసంతో విపక్షం ఇబ్బంది పడిందంటూ వ్యాఖ్యానించారు. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై మాట్లాడేందుకు లిస్ట్ చేసిన నేతలపైనా మోడీ సెటైర్లు వేశారు.
చివరి బంతికి సిక్సర్ కొట్టాలని వారు కోరుకుంటున్నారని ప్రధాని అన్నారు.ఇది వారి స్వంత అంతర్గత విశ్వాసానికి పరీక్ష అన్నారు. అవిశ్వాస ఓటుతో ఎవరు ఐక్యంగా ఉన్నారో, ఎవరు ప్రతిపక్షంలో లేరో స్పష్టంగా తెలుస్తుందని మోడీ పేర్కొన్నారు. 2018లోనే వారికి అవిశ్వాసం పెట్టామని మోడీ గుర్తుచేశారు. విపక్ష కూటమిని అహంకార ఇండియాగా మోడీ అభివర్ణించారు. కొంతమంది చాలా అహంకారంతో ఉన్నారన్నారు. వారంతా బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారని, సామాజిక న్యాయం గురించి మాట్లాడే వీరంతా రాజవంశాల్ని, బుజ్జగింపులను ప్రోత్సహిస్తున్నారంటూ మోడీ మండిపడ్డారు.