Wednesday, January 22, 2025

గిరిజనులను పట్టించుకోని నాటి పాలకులు

- Advertisement -
- Advertisement -

PM Modi attacks Congress in Gujarat

కాంగ్రెస్‌పై ప్రధాని మోడీ ధ్వజం

నవ్‌సారి(గుజరాత్): స్వాతంత్య్రానంతరం దేశాన్ని అత్యధిక కాలం పాలించిన వారు గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వలేదని ప్రధాని నరేంద్ర మోడీ పరోక్షంగా కాంగ్రెస్‌పై మండిపడ్డారు. గిరిజన ప్రాబల్య నవ్‌సారి జిల్లాలోని ఖుద్వేల్ గ్రామంలో శుక్రవారం గుజరాత్ గౌరవ్ అభియాన్ ర్యాలీని ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ ఓట్లు పొందేందుకో ఎన్నికల్లో గెలుపొందేందుకో తాను అభివృద్ధి పనులను ప్రారంభించనని అన్నారు. ప్రజల జీవితాలను మెరుగుపరచాలన్న లక్షంతోనే తాను పనిచేస్తానని ఆయన చెప్పారు. స్వాతంత్య్రానంతరం దేశంలో అత్యధిక కాలం అధికారంలో ఉన్నవారు గిరిజన ప్రాంతాల అభివ్ధృక ఎన్నడూ తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని, కష్టపడాల్సి వస్తుంది కాబట్టే వారు గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయలేదని మోడీ విమర్శించారు. గతంలో గిరిజన ప్రాంతాలలో సరైన రోడ్లు కూడా లేవని ఆయన అన్నారు. ఈ సందర్భంగా రూ. 3,050 కోట్ల వ్యయంతో చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు ప్రధాని మోడీ శంకుస్థాపన లేక ప్రారంభోత్సవం చేశారు. మారుమూల ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలలో వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టేందుకు గతంలో అనేక ఏళ్లు పట్టేదని, నగరాలలో ఈ కార్యక్రమం పూర్తయ్యేది కాని అటవీ ప్రాంతాలలో నివసించే ప్రజలకు వ్యాక్సినేషన్ జరిగేది కాదని ఆయన అన్నారు.

అయితే తమ ప్రభుత్వం గిరిజన ప్రాంతాలలో సైతం కొవిడ్ వ్యాక్సినేషన్ సమర్థవంతంగా నిర్వహించిందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా కరోనా వ్యాక్సిన్ మీకు ఉచితంగా లభించిందా లేక డబ్బుకా అని ప్రధాని ప్రశ్నించినపుడు ప్రజలు ఉచితంగా అని జవాబిచ్చారు. గతంలో ఈ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారని, కాని ఆయన సొంత గ్రామంలోనే మంచినీటి ట్యాంకు లేదని, గ్రామస్తులు చేతి పంపులపై ఆధారపడేవారని మోడీ చెప్పారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ గ్రామంలో వాటర్ ట్యాంకు నిర్మాణానికి తాను ఆదేశించానని ఆయన గుర్తు చేశారు. ఆ రోజుల్లో జామ్‌నగర్‌లో వాటర్ ట్యాంకు ప్రారంంభోత్సవం కూడా దినపత్రికల్లో మొదటి పేజీ వార్త అయ్యేదని ఆయన అన్నారు. ఈ ఏడాది చివరిలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా రాష్టంలో అధికారాన్ని పదిలపరుచుకునేందుకు బిజెపి ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News