Tuesday, February 11, 2025

భారత డిజిటల్ విప్లవం ప్రశంసనీయం:ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

కృత్రిమ మేధ ఈ శతాబ్దంలో మానవాళి కోసం కోడ్ లిఖిస్తున్నదని భారత ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. పారిస్‌లో కృత్రిమ మేధ (ఎఐ) కార్యాచరణ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ ఈ విషయం తెలిపారు. ‘ఈ శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యం వహిస్తున్నందుకు, సహ అధ్యక్షత నిమిత్తం నన్ను ఆహ్వానించినందుకు నా మిత్రుడు అధ్యక్షుడు మాక్రాన్‌కు కృతజ్ఞుడిని. ఎఐ ఇప్పటికే మా ఆర్థిక వ్యవస్థకు, భద్రతకు, తుదకు సమాజానికి తిరిగి రూపకల్పన చేస్తున్నది. ఎఐ ఈ శతాబ్దంలో మానవాళి కోసం కోడ్‌ను లిఖిస్తోంది’ అని ప్రధాని మోడీ ఉద్ఘాటించారు. మోడీ ఒక సులభ ప్రయోగాన్ని ప్రస్తావిస్తూ, ‘మీ వైద్య నివేదికను ఒక ఎఐ యాప్‌నకు మీరు అప్‌లోడ్ చేసినట్లయితే అది మీ ఆరోగ్యానికి ఎంత అవసరమో సులభ భాషలో, ఎటువంటి ఆడంబర పదజాలం లేకుండా వివరించగలదు.

అయితే, తమ ఎడమ చేతితో ఎవరో రాస్తున్న చిత్రాన్ని గీయవలసిందిగా అదే యాప్‌ను మీరు కోరినట్లయితే, ఆ యాప్ తమ కుడి చేతితో ఎవరో రాస్తున్న చిత్రాన్ని గీసే అవకాశం ఉంది&’ అని చెప్పారు. పారదర్శకతను పెంపొందిచే ఓపెన్ సోర్స్ వ్యవస్థల ఆవశ్యకత గురించి కూడా ఆయన నొక్కిచెప్పారు. ‘పాలన కూడా ముఖ్యంగా వర్ధమాన దేశాల్లో అందరికీ అందుబాటులో ఉండేలా చూడవలసి ఉంటుంది. ఆర్థిక వనరుల కోసం డేటా లేదా ప్రతిభ లేదా శక్తి కావచ్చు అందులోనే సామర్థాలు చాలా వరకు లోపిస్తున్నాయి. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, ఇంకా మరి ఎన్నిటినో మెరుగుపరచడం ద్వారా లక్షలాది జీవితాల్లో ఎఐ పరివర్తన తీసుకురాగలదు. సుస్థిర అభివృద్ధి లక్షాల దిశగా ప్రస్థానాన్ని సులభతరం, వేగవంతం చేసే ప్రపంచాన్ని సృష్టించడంలో అది తోడ్పడుతుంది. ఇందు కోసం మనం వనరులు, ప్రతిభను సంఘటితంగా ముందుకు తీసుకువెళ్లాలి. నమ్మకాన్ని, పారదర్శకతను పెంపొందించే ఓపెన్ సోర్స్ వ్యవస్థలను మనం అభివృద్ధి చేయాలి.

పక్షపాత రహితంగా నాణ్యమైన డేటా సెట్లను మనం నిర్మించాలి&’ అని ప్రధాని ఉద్ఘాటించారు. భారత డిజిటల్ విప్లవాన్ని ప్రధాని మోడీ శ్లాఘిస్తూ, ‘భారత్ అత్యంత తక్కువ వ్యయంతో 140 కోట్ల మంది ప్రజల కోసం డిజిటల్ సార్వత్రిక మౌలికవసతులను విజయవంతంగా నిర్మించింది. దానిని సార్వత్రిక, అందుబాటులోని నెట్‌వర్క్ ఆధారంగా నిర్మించడమైంది. మా ఆర్థిక వ్యవస్థను ఆధునికం చేసేందుకు, పాలనను సంస్కరించేందుకు, మా ప్రజల జీవితాలను మార్చేందుకు విస్తృత శ్రేణి అవకాశాలు, నిబంధనలు ఉన్నాయి& ప్రస్తుతం భారత్ డేటా రక్షణపై ఎఐ అనుసరణ, సాంకేతిక న్యాయపరమైన పరిష్కారాల్లో సారథ్యం వహిస్తోంది& ప్రపంచంలోనే అతిపెద్ద కృత్రిక మేధ విభాగాల్లో ఒకటి మాకు ఉన్నది’ అని మోడీ తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News